Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

తెలంగాణఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, మద్యం పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ వ్యాపారి నమిద్ మిశ్రా కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఘటనలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 15, 2026 8:56 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

అక్షరటుడే, హైదరాబాద్: Moinabad Drugs Party | డ్రగ్స్​ పార్టీలకు తెలంగాణ నిలయంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధానితోపాటు శివారు ప్రాంతాల్లో తరచూ డ్రగ్స్​ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్​ సరఫరా, వినియోగంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఉండటంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Contents
  • Moinabad Drugs Party | కాల్పుల క‌ల‌క‌లం…
    • Moinabad Drugs Party | ఐదుగురికి పాజిటివ్​!
      • Moinabad Drugs Party | ఓ వైపు చర్యలు.. మరోవైపు ఇలా..

హైదరాబాద్ శివార్లలో మరోసారి డ్రగ్స్ పార్టీ Drugs Partyకలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, మద్యం పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. ఈ దాడిలో కాల్పుల ఘటన కూడా చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

ఇంటెలిజెన్స్ సమాచారంతో శనివారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో తెలంగాణ ఈగల్ టీమ్, ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్), స్థానిక పోలీసులు కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి పర్యవేక్షణలో ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఫామ్‌హౌస్‌లో పార్టీ కొనసాగుతుండగా.. అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.akshara drugs party

Moinabad Drugs Party | కాల్పుల క‌ల‌క‌లం…

ఈ సమయంలో ఢిల్లీకి delhi చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా ఆందోళనకు గురై పోలీసులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం అతను గాలిలోకి కాల్పులు జరిపాడని చెబుతుండగా, మరికొన్ని నివేదికలు మాత్రం పోలీసులపై కాల్పులు జరిగాయని పేర్కొంటున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

పోలీసులు వెంటనే నమిద్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో ఆ తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. తుపాకీతో పాటు బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఫామ్‌హౌస్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Moinabad Drugs Party | ఐదుగురికి పాజిటివ్​!

పోలీసులు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఢిల్లీ వ్యాపారి నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి (రోహిత్ రెడ్డి సోదరుడు), ఎం. రమేష్, శ్రవణ్ కుమార్, నల్లపునేని విజయకృష్ణ, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి, ఒక మహిళ ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వారందరికీ పోలీసులు డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.

ఇందులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు Mahesh Kumarడ్రగ్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే మరో ఐదుగురికి మాత్రం డ్రగ్స్ వినియోగించినట్టు పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Moinabad Drugs Party | ఓ వైపు చర్యలు.. మరోవైపు ఇలా..

ఈ ఘటన తెలంగాణలో డ్రగ్స్ సులభంగా అందుబాటులోకి వస్తున్నాయన్న చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చుతామని ప్రకటిస్తున్నప్పటికీ, ఫామ్‌హౌస్ పార్టీల్లో డ్రగ్స్, విదేశీ మద్యం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సంబంధం ఉన్న పార్టీల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!

Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
TAGGED:Cyberabad police raiddrugs party controversyfarmhouse party raidHyderabad drugs caseMoinabad drugs partyPilot Rohit Reddy farmhouse raidTelangana Crime NewsTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే! March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!
Next Article Nepali Gang Theft Nepali Gang Theft | రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్​.. జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?