అక్షరటుడే, హైదరాబాద్: Moinabad Farmhouse Drugs Party | గ్రేటర్ హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కాల్పులు కలకలం రేపాయి. సదరు ఫామ్‌హౌస్ ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందినదిగా తెలుస్తోంది. ఇందులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి చేశారు.
Moinabad Farmhouse Drugs Party | ఈగల్ టీం..
ఇక్కడ జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వినియోగంతోపాటు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీమ్‌కు సమాచారం అందడంతో పోలీసులు అధికారులు సోదాలకు వెళ్లారు. పోలీసులన చూసిన అక్కడి యువకులు హంగామా సృష్టించారు.
పోలీసులను అడ్డుకునేందుకు వారిపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్కడి యువకులు రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) రంగంలోకి దిగింది. ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టింది.
Moinabad Farmhouse Drugs Party | భారీగా డ్రగ్స్..
పోలీసు అధికారుల సోదాల్లో భారీగా కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించినట్లు సమాచారం. దీంతో డ్రగ్స్ నిల్వలతోపాటు రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇల్లీగల్ డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారిలో ఒక ప్రజాప్రతినిధి సహా అంతా వీఐపీలే ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన వారంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడం గమనార్హం. దీంతో ఈ కేసును పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ పార్టీ నిర్వాహకుల్లో రాజకీయ నేతలు ఉండటంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిందితులను పోలీసులు అరెస్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

