అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mojtaba Khamenei Coma | ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ –అమెరికా దాడుల్లో ఆయన గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లే ఖమేని (Ayatollah Khamenei) ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆయన కూడా అస్వస్థతకు గురై, ఖోమ్‌లో వైద్య చికిత్స పొందుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. యుద్ధ సమయంలో దేశ నాయకత్వ నిర్మాణంపై ఇది కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Mojtaba Khamenei Coma | నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో..
ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారని, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. దీంతో ఆయన నిర్ణయాధికార బాధ్యతలు చేపట్టలేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. షియా ముస్లింలు పవిత్రమైనదిగా భావించే ఖోమ్‌లో ఆయన చికిత్స పొందుతున్నారని ఓ నివేదిక పేర్కొంది.
Mojtaba Khamenei Coma | వీడియో విడుదల
మార్చి ఆరంభంలో సర్వోన్నత నాయకుడిగా నియమితులైనప్పటికీ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఆయన పేరిట రెండు ప్రకటనలు మాత్రం వెలువడ్డాయి. అయితే ఐఆర్జీసీ ఇటీవల ఖమేని యుద్ధ గదిలోకి ప్రవేశించి వీడియోను విడుదల చేసింది. అయితే అది ఏఐ వీడియో అని కొందరు ఆరోపిస్తున్నారు. ఖమేనీ మాట్లాడుతున్నట్లు ధృవీకరించబడిన ఫుటేజ్ లేకపోవడం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
ఇది కూడా చదవండి..: Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్
