అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mojtaba Khamenei Iran | ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ (56) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ దేశ మీడియా వెల్లడించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. 36 ఏళ్లు దేశాన్ని పాలించిన ఖమేనీ ఫిబ్రవరి 28న చనిపోయారు. ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించారు. ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదే కూడా దాడుల సమయంలో తగిలిన గాయాలతో మరణించారు. దీంతో అయతుల్లా అలిరేజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించారు. తాజాగా అరాఫీ, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలాంహోస్సేన్ మొహ్సేని ఎజీలతో కూడిన ముగ్గురు సభ్యుల ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి తదుపరి వారసుడిని ఎన్నుకుంది.
Mojtaba Khamenei Iran | ఇరాన్ నిపుణుల సభ
ఇరాన్ సుప్రీం నాయకుడిగా ఆయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా హొస్సేనీ ఖమేనీ (Mojtaba Hosseini Khamenei) ఎన్నికయ్యారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇరాన్ నిపుణుల సభ ఆయనను ఖమేనీ వారసుడిగా ప్రకటించింది. కాగా ఖమేనీని పవిత్ర నగరం మష్హాద్‌లో ఖననం చేస్తారని, టెహ్రాన్‌లో “పెద్ద వీడ్కోలు” కార్యక్రమం జరుగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ టెలిగ్రామ్‌లో పోస్ట్‌లో తెలిపారు.

Mojtaba Khamenei Iran | మొజ్తాబా ఖమేనీ నేపథ్యం
మొజ్తాబా ఖమేనీ ఎప్పుడూ ప్రభుత్వ పదవిని నిర్వహించలేదు. అయితే తెర వెనుక ఆయన కీలకంగా వ్యవహరించేవారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ఇరాన్ సాయుధ దళాలలో ఆయన పనిచేశారు. IRGCతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2004లో ఇరాన్ సంప్రదాయవాద రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ ఛైర్మన్ ఘోలం-అలీ హద్దాద్-అదెల్ కుమార్తె జహ్రా హద్దాద్-అదెల్‌ను ఖమేనీ వివాహం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి..: Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు

