అక్షరటుడే, వెబ్‌డెస్క్: Monalisa Love Marriage | సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ‘కుంభమేళా మోనాలిసా’గా ప్రసిద్ధి పొందిన Monalisa Bhosle తన జీవితంలో మరో సంచలన పరిణామం జరిగింది. కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడిని మోనాలిసా పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
Monalisa Love Marriage | తండ్రిపై ఫిర్యాదు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా.. ఇటీవల Thiruvananthapuramలోని Thampanoor Police Stationలో ఫిర్యాదు చేసి తన తండ్రిపై ఫిర్యాదు చేసింది. తనకు బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు ఇష్టమైన యువకుడితోనే జీవించాలని తాను నిర్ణయించుకున్నట్లు పోలీసులకు మోనాలిసా వెల్లడించింది.
తన ప్రియుడు Farman Khanతో కలిసి మోనాలిసా పోలీస్ స్టేషన్‌కు చేరుకొని రక్షణ కోరింది. తన తండ్రి తనను స్వగ్రామానికి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇద్దరు ప్రేమికులతోపాటు కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఆమెకు 18 సంవత్సరాలు నిండినందున తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఆమెకు ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
Monalisa Love Marriage | ఒక చిత్రంలో..
పోలీసుల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం తన ప్రియుడితో మోనాలిసా వెళ్లిపోయింది. తర్వాత తిరువనంతపురంలోని ఒక ఆలయంలో ఇరువురూ వివాహం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులను ఎదురించి, తమ ప్రేమను విజయవంతం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక మోనాలిసా Maha Kumbh Mela సమయంలో పూలమాలలు అమ్ముతూ ఉండేది. కాగా, ఆ సమయంలో తీసిన ఆమె చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మెనాలిసా Mona Lisa అందం, ప్రత్యేకమైన కళ్ల వల్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, సినీ అవకాశాలు కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంలో మోనాలిసా నటిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక

