అక్షరటుడే, వెబ్డెస్క్ : Monsoon Rainfall Deficit | రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు తన ఉగ్రరూపం చూపుతున్నాడు. దీంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. అయితే ఈ ఏడాది వర్షాకాలంలో లోటు వర్షపాతం (Rainfalll) నమోదు అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2025లో అధిక వర్షపాతం నమోదు అయింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. అయితే 2026లో పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయి. బలమైన ‘ఎల్-నినో’ ప్రభావంతో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వర్షాకాలం 2018 నాటి పరిస్థితులను పోలి ఉంటుందని అధికారులు తెలిపారు.
Monsoon Rainfall Deficit | ఆ జిల్లాలపై ప్రభావం
సాధారణంగా రాష్ట్రంలో జూన్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణ (Telangana)లో వర్షాలు మొదలు అవుతాయి. గతేడాది మేలోనే రుతుపవనాలు వచ్చాయి. ఈ ఏడాది రుతుపవన కాలంలోని అన్ని నెలల్లోనూ (జూన్ – సెప్టెంబర్) వర్షపాతం సాధారణ స్థాయికి దిగువన, ఓ మోస్తరుగా మాత్రమే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు 2014-15 నాటి పరిస్థితుల వలె అత్యంత దారుణంగా ఉండవు. అయినప్పటికీ, గత 5-6 ఏళ్లతో పోలిస్తే, ఈ సంవత్సరం రుతుపవన వర్షాలు తక్కువగానే ఉంటాయని తెలిపారు. లోటు వర్షపాతం కారణంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Monsoon Rainfall Deficit | పంటల సాగుపై..
రాష్ట్రంలో వరి పంట (Paddy) ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. దీనికి నీరు అధికంగా అవసరం ఉంటుంది. అయితే రానున్న వర్షాకాలం (Rain season)లో నీటిని పొదుపుగా వాడుకోవాలని, తదనుగుణంగా పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేకపోతే వరి పైర్లు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారు.
జిల్లాల వారీగా..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం కురుస్తుందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Ilapur Land Scam | ఐలాపూర్లో ముఖీమ్ భూ దందా.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
