అక్షరటుడే, వెబ్‌డెస్క్: morning water benefits | మన దైనందిన జీవితంలో మనం పాటించే కొన్ని చిన్న మార్పులే మన ఆరోగ్యాన్ని ఊహించని రీతిలో మెరుగుపరుస్తాయి. సాధారణంగా అందరూ నిద్రలేవగానే బ్రష్ చేశాకే నీళ్లు తాగుతుంటారు.
కానీ, నోరు కడుక్కోకముందే గ్లాసు నీళ్లు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అటు ఆయుర్వేదం, ఇటు ఆధునిక వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు.
morning water benefits | ఆరోగ్య ప్రయోజనాలు..
జీర్ణక్రియకు ఊతం: మనం నిద్రపోతున్న సమయంలో నోటిలో ఎన్నో మేలు చేసే ఎంజైమ్స్ కలిగిన లాలాజలం తయారవుతుంది. బ్రష్ చేయకుండా నీళ్లు తాగినప్పుడు, ఈ లాలాజలం నేరుగా పొట్టలోకి చేరుతుంది. ఇది ఆహారం త్వరగా అరగడానికి, కడుపులో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవడానికి సహాయపడుతుంది.
బలమైన రోగనిరోధక శక్తి: పరగడుపున నీరు తీసుకోవడం వల్ల రక్తంలోని వ్యర్థాలు, విషతుల్యాలు (Toxins) బయటకు వెళ్ళిపోతాయి. దీనివల్ల మన బాడీ క్లీన్ అవ్వడమే కాకుండా, సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు వంటి వాటితో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది.
morning water benefits | చర్మ సౌందర్యం, జుట్టు సంరక్షణ..
శరీరంలో నీటి శాతం పెరగడం వల్ల చర్మం ఎప్పుడూ తేమగా (Hydrated) ఉంటుంది. ఇది మొటిమలను నివారించి, ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. అంతేకాకుండా, జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
BP బీపీ, షుగర్ నియంత్రణ: ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా హై బీపీ, మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, శరీర మెటబాలిజం Metabolism రేటు పెరగడం వల్ల అనవసరపు కొవ్వు కరిగి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరంగా మారుతుంది.
చల్లటి నీళ్ల కంటే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. నీళ్లు తాగిన తర్వాత కనీసం 30 నుంచి 45 నిమిషాల వరకు ఏమీ తినకూడదు. ఆ తర్వాతే బ్రష్ చేసి మీ అల్పాహారాన్ని తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..: Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్.. దీని పవర్ తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!
ఇది కూడా చదవండి..: Milk and Curd | ఎండలకు పాలు విరిగిపోతున్నాయా?.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు.. అస్సలు పాడవ్వవు!
