అక్షరటుడే, వెబ్డెస్క్ : Mother Attack Children | యాదాద్రి భువనగరి (Yadadri Bhuvanagiri) జిల్లా బీబీనగర్ మండలం తొక్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా.. మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
బీబీనగర్ (Bibi Nagar) మండలం జైనపల్లికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డితో నీలిమ అనే మహిళకు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కృతిక (14), అక్షిత్ రెడ్డి (11) ఉన్నారు. కొంతకాలంగా నీలిమ మానసిక స్థితి సరిగ్గా లేదని సమాచారం. శనివారం సాయంత్రం ఆమె తన తల్లిగారింటికి తొక్కాపురం వెళ్లింది. రాత్రి పిల్లలిద్దరూ నిద్రిస్తున్న సమయంలో కత్తితో వారిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కూతురు కృతిక అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు తల్లి దాడి నుంచి తప్పించుకొని బయటకు పరుగు తీయడంతో ప్రాణాలతో బయట పడ్డాడు.
Mother Attack Children | కేసు నమోదు
పిల్లలపై దాడి చేసిన అనంతరం నీలిమ ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. అయితే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కిందికి దించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల పలువురు వివిధ కారణాలతో పిల్లలను చంపాడానికి వెనుకాడటం లేదు. కన్న పేగు బంధాన్ని మరిచి పిల్లలను హత్య చేస్తున్నారు. ఇటీవల కామారెడ్డి (Kamareddy)లో ఓ వ్యక్తి ముగ్గురు కూతుళ్లను చెరువులో పడేసి హత్య చేశాడు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
దీనిని కూడా చదవండి : Medak Road Accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

