Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ

బిజినెస్​

Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ

మోటోరోలా మిడ్ రేంజ్‌లో మరో మోడల్‌ను తీసుకువస్తోంది. ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ను ఈనెల 6న విడుదల చేయనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 11:38 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Motorola Edge 70 Fusion
Motorola Edge 70 Fusion

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Motorola Edge 70 Fusion | ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ సంస్థ అయిన మోటోరోలా భారత మార్కెట్‌లో మరో మోడల్‌ను లాంచ్ చేయడానికి రెడీ అయ్యింది. ఎడ్జ్ 70 ఫ్యూజన్ పేరుతో నూతన మోడల్‌ను ఈనెల 6న విడుదల చేయనుంది.

Contents
  • Motorola Edge 70 Fusion | యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టం
    • Motorola Edge 70 Fusion | 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

ఇది స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.

6.8 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేతో తీసుకువస్తున్న ఈ ఫోన్.. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1220 * 2712 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. హెచ్‌డీఆర్ 10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, ఐపీ68/ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది. 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

Motorola Edge 70 Fusion | యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టం

స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత మోటో హలో యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఓఎస్, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Motorola Edge 70 Fusion | 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

వెనకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 710 మెయిన్ కెమెరాతో పాటు 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది.ఇది 4కే వీడియో రికార్డింగ్‌కు అనుకూలం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 710 మెయిన్ కెమెరాతో వచ్చిన ప్రపంచంలోనే మొదటి ఫోన్ ఇదని కంపెనీ పేర్కొంది.

7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ టర్బో చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

బ్లూ సర్ఫ్, కంట్రీ ఎయిర్, సిల్హౌట్ కలర్స్‌లో 12 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

బేస్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం గల మోడల్ ధర సుమారు రూ. 30వేలు ఉండే అవకాశాలున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: Realme Narzo Power 5G | ఇది రియల్‌మీ ‘పవర్’!.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం

March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట
Rupee Record Low | వణికిపోతున్న రూపాయి.. డాలర్‌తో రూ. 92.36కు పడిపోయిన విలువ
IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
Indian Stock Market | భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. ఐటీ స్టాక్స్‌ కుదేలు..
Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
TAGGED:144Hz AMOLED display mobile7000mAh battery smartphoneFlipkart mobile launchMid range 5G smartphoneMotorola Edge 70 FusionMotorola Edge seriesMotorola India launchSnapdragon 7s Gen 4 phone
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Holidays Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు
Next Article RK Roja Tamil Nadu RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?