Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సినిమాతెలంగాణ

Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నిర్మాతలకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. సినిమా టికెట్​ ధరల పెంపుపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 3:24 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Movie Ticket Prices

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Ticket Prices | తెలంగాణలో మూవీ టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు  (High Court)ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో కొత్త సినిమాలకు ఊరట లభించింది.

Contents
  • Movie Ticket Prices | వివాదం ఏమిటంటే?
    • Movie Ticket Prices | ప్రభుత్వంపై ఆగ్రహం
      • Movie Ticket Prices | నిర్మాతలకు గుడ్​న్యూస్​

సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపి వేసింది. టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఏఎస్‌ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. టికెట్‌ ధరల పెంపుపై గతంలో అనుసరిస్తున్న విధానాలు పాటించాలని సూచించింది.

Movie Ticket Prices | వివాదం ఏమిటంటే?

తెలంగాణలో సినిమా టికెట్​ రేట్ల పెంపుపై గతంలో పలుమార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్రాంతికి విడుదలైన రాజాసాబ్ (The Raja Saab) మూవీకి ధరలు పెంచుకోవడానికి అర్ధరాత్రి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. హైకోర్టు ఆ జీవోను కొట్టివేసింది. అయినా కూడా ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా రేట్లు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీనిపై ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్​ వేశారు.

Movie Ticket Prices | ప్రభుత్వంపై ఆగ్రహం

రాష్ట్రంలో సినిమా టికెట్​ ధరల పెంచబోమని గతంలో పలుమార్లు సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ధరలు పెంచమని తమను ఎవరు కలువొద్దన్నారు. అయినా కూడా బెనిఫిట్​ షోలు, టికెట్​ ధరల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ విజయ్ గోపాల్ హైకోర్టులో హోంశాఖ అధికారులు గత ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని వాదించారు. మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ల రేట్లు పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచి పెట్టారని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకునే 90 రోజుల ముందే ప్రకటించాలని ఆదేశించింది.

Movie Ticket Prices | నిర్మాతలకు గుడ్​న్యూస్​

హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో నిర్మాతలకు ఊరట లభించింది. ఇక నుంచి కొత్తగా విడుదల అయ్యే సినిమాలకు టికెట్ ధరలు, బెనిఫిట్​ షోలకు అనుమతి లభించనుంది. దీంతో నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ ధరల పెంపు సరికాదని సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక

Moinabad Drugs Case | డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం.. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ సీజ్
Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి
KTR Assembly Attack | శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : కేటీఆర్​
Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం
TAGGED:benefit shows indiaindian film industrymovie ticket rulessupreme court indiatelangana high courttelangana movie ticket pricesticket price hikeTollywood News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IVF Services Praised IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
Next Article Kamareddy Industrial Corridor Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్​ వినతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?