అక్షరటుడే, కామారెడ్డి: Mud Bath Therapy | కామారెడ్డి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, భారత్ స్వాభిమాన్ సంయుక్త (bharat swabhiman yoga) ఆధ్వర్యంలో కామారెడ్డి పెద్ద చెరువు (kamareddy) వద్ద భారీ స్థాయిలో మట్టి స్నానాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వినూత్న కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి సుమారు 130 మంది యోగా సాధకులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు.
Mud Bath Therapy | ప్రకృతికి దూరం కావొద్దనే ఉద్దేశంతో..
ప్రకృతి వైద్యంలో అత్యంత కీలకమైన మట్టి స్నానం ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగా రాంరెడ్డి తెలిపారు. ఆధునిక జీవనశైలిలో మానవుడు (natural healing therapy) ప్రకృతికి దూరమవుతున్నాడని, తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం (traditional wellness practice) సాధ్యమని పేర్కొన్నారు. మట్టి స్నానం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, ఇది ఒక అద్భుతమైన చికిత్స అని తెలిపారు.
Mud Bath Therapy | మట్టిలో సహజసిద్ధమైన ఖనిజాలు..
మట్టిలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు చర్మ వ్యాధులను నివారించి, చర్మాన్ని శుభ్రపరుస్తాయన్నారు. ఎండాకాలంలో పెరిగే శరీర వేడిని తగ్గించి, శరీరాన్ని శీతలీకరించడానికి మట్టిస్నానం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని విషపూరిత వ్యర్థాలను (yoga practitioners india) బయటకు పంపి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందన్నారు. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖులు బాస రఘుకుమార్, రాజ్ కుమార్, రమేష్, సిద్దాగౌడ్, ఎల్లయ్య, అంజయ్య, అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత

