అక్షరటుడే, బాన్సువాడ: Municipal Workers Protest | మున్సిపల్ కార్మికుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) చర్చించి తక్షణమే పరిష్కరించాలని పట్టణానికి చెందిన మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు వారు “చలో హైదరాబాద్” (Chalo Hyderabad) కార్యక్రమానికి బయలుదేరారు.
Municipal Workers Protest | ఇందిరాపార్క్ వద్ద..
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జే.రవీందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాకముందు కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల (Municipal Workers) ప్రధాన డిమాండ్లలో కనీస వేతనాన్ని రూ.18 వేలకు పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడం, పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు.
Municipal Workers Protest | డిమాండ్లు నెరవేర్చకపోతే..
ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనేందుకు వారు వెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బుజ్జిగారి సాయిలు, మేత రాజు, పెరక శివరాజు, నల్ల కాశీరాం, తాటి గంగారం, అత్తర్ ముక్కగల సాయిలు, నల్ల బాలమణి, సాయవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Armur Municipal Protest | ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట కార్మికుల ఆందోళన..

