Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా

నిజామాబాద్

Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా

మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులను నివారించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని తక్షణమే వేతనాలు చెల్లించాలని టీయూసీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 3:38 సా.
Srinivas Kolluri
4 రోజులు ago
Share
Municipal Workers Protest

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Municipal Workers Protest | మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులను నివారించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని తక్షణమే వేతనాలు చెల్లించాలని టీయూసీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ (Collectorate) ఎదుట కార్మికులు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

Contents
  • Municipal Workers Protest | మున్సిపల్​ కార్పొరేషన్​లో..
    • Municipal Workers Protest | సీఐజీ గ్రూప్​లకు వేతనాలు నిల్​..

Municipal Workers Protest | మున్సిపల్​ కార్పొరేషన్​లో..

ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో (Nizamabad Municipal Corporation) పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అడిగితే కేసులు పెట్టడం సరికాదన్నారు. వెంటనే ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Municipal Workers Protest | సీఐజీ గ్రూప్​లకు వేతనాలు నిల్​..

కాంట్రాక్ట్​ ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి, సీఐజీ గ్రూప్​ల కార్మికులకు ఇవ్వకపోవడం అధికారుల కక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. మున్సిపల్ కార్మికులకు రేపటిలోగా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూప్​లను కొనసాగిస్తూ, అవుట్​ సోర్సింగ్​ ఏజెన్సీ కార్మికులను గ్రూప్​లుగా చేయాలన్నారు. ఔట్​ సోర్సింగ్​ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26వేలు ఇవ్వాలన్నారు.సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, నాయకులు కిరణ్, రవి, యాదమ్మ, శాంతికుమార్, విజయ్, గంగాధర్, లక్ష్మి, శైలజ, నవీన్, నరేష్, రాము, మహిపాల్, సహదేవ్, వినోద, మాధవి, సాయిలు, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి..

Kamareddy Railway Modernization | రైల్వే ఆధునీకరణ పనులకు నిధులివ్వండి: కేంద్ర రైల్వే మంత్రికి ఎమ్మెల్యే వినతి
BLO Absence Issue | బీఎల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం
Street Dog Attack | చిన్నారులపై వీధి కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్.. హైదరాబాద్​కు తరలింపు
Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం
TAGGED:CITU AITUC TUCICollectoratelabor unions Indiamunicipal workersMunicipal Workers ProtestNizamabad Municipal CorporationNizamabad Newsprotest newswage issueworkers protest India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Prajavani Complaints Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
Next Article India War Challenges India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?