Murder Accused Arrest | అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Murder Accused Arrest | ఓ హత్య కేసులో నిందితుడిని గ్యాస్ సిలిండర్ బుకింగ్ పట్టించింది. తన భార్యను హత్య చేసి పరారీలో ఉన్న ఆర్మీ మాజీ కెప్టెన్‌ను నాలుగేళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు.
సందీప్ తోమర్ అనే వ్యక్తి బీహార్ (Bihar) 12 రెజిమెంట్‌లో పని చేసేవాడు. 2014లో తన భార్య శ్వేతను గొంతు నులిమి చంపాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నించాడు. అయితే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అధికారులు సందీప్‌ను సైన్యం నుంచి తొలగించారు. ఫిరోజ్‌పూర్‌లోని జైలులో ఉన్న నిందితుడు 2019లో బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం అతని శిక్షను సమర్థిస్తూ 2022లో హైకోర్టు (High Court) తీర్పు ఇవ్వడంతో పరారు అయ్యాడు.
Murder Accused Arrest | బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా..
పోలీసులు సందీప్ కోసం నాలుగేళ్లుగా గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ బృందం నిందితుడి పాన్ కార్డు (PAN Card) వివరాలు కనుగొంది. అతనితో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాలను దీని ద్వారా గుర్తించారు. బ్యాంకు స్టేట్‌మెంట్‌లను పరిశీలించగా.. ఒక ప్రైవేట్ కంపెనీ జమ చేసిన జీతం, ఆ ఖాతాకు లింక్ ఉన్న ఒక మొబైల్ నంబర్ బయటపడ్డాయి. దీని ఆధారంగా తోమర్ పాంధుర్నాలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే అతను ఎక్కడ ఉన్నాడనేది మాత్రం తెలియలేదు.
Murder Accused Arrest | డెలివరీ అయిన అడ్రస్‌లో..
ఇటీవల తోమర్ తన పేరు మీద ఒక గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) బుక్ చేశాడు. గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడంతో, సిలిండర్ డెలివరీ అయిన అద్దె ఇంటిని పోలీసులు గుర్తించగలిగారు. దీంతో తోమర్‌ను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహాయంతో అతడిని తిరిగి పంజాబ్‌కు తీసుకువచ్చారు.
దీనిని కూడా చదవండి : Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్‌లో చిక్కుకుని మహిళ మృతి
