అక్షర టుడే, ఆర్మూర్: Muscat Road Accident : మస్కట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఆండ్రాసి మల్లయ్య (45) మృతి చెందారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆయన మంగళవారం సాయంత్రం రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Muscat Road Accident మృతదేహం తరలించాలని వేడుకోలు..
మల్లయ్య కుటుంబ పోషణ కోసం కొన్నేళ్లుగా మస్కట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్వగ్రామమైన ఆలూర్‌కు త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం సహకారంతో మృతదేహం రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

