అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Musi Project Houses | మూసీ ప్రాజెక్ట్ పేరుతో హైదరాబాద్ నగరంలోని 10,017ఇళ్లు కూల్చబోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మూసీ ప్రాజెక్ట్తో లక్షలాది మంది రోడ్డున పడతారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నదిని శుభ్రం చేయడానికి అన్ని ఇళ్లూ కూల్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇరాన్‌లో మిస్సైల్స్ వల్ల ఇళ్లు కూలుతుంటే..ఇక్కడ బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సిద్ధం అయ్యారని ఆరోపించారు. ఈ బుల్డోజర్ రాజ్‌పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Musi Project Houses | డీపీఆర్ సిద్ధమైందా…
అసలు మూసీ ప్రాజెక్ట్‌కు డీపీఆర్ సిద్ధమైందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. బాపూఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డీపీఆర్ కోసం.. 18 నెలల సమయం పడుతుందని అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అప్పుడే పేదల ఇళ్లు కూల్చేందుకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మూసీ– గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం సామాన్య ప్రజల ఇండ్లు, భూములు గుంజుకుంటూ వాళ్ల మధ్యన చర్చ పెట్టకుండా 5 స్టార్ హోటల్ తాజ్ కృష్ణ (Hotel Taj Krishna)లో ప్రెజెంటేషన్ పెడతా అంటున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Musi Project Houses | వారికి ఏం ఇచ్చారు
మూసీ ప్రాజెక్టు (Musi Project)లో ఇప్పటికే 300 ఇళ్లు కూల్చారని హరీశ్‌రావు అన్నారు. ఆ బాధితులకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ (KCR) కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వారిని పంపించి మమ అనిపించారన్నారు. 2013 చట్టం ప్రకారం అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ, అమ్ముకునే శాశ్వత హక్కుతో కూడిన ఇల్లు కట్టించి, కుటుంబానికి దాదాపు రూ.15 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి 300 మందిని మూడు దిక్కులా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి పంపించారని విమర్శించారు.
మూసీ ప్రాజెక్ట్‌లో కూలిపోనున్న మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు మరో అపార్ట్మెంట్ కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు మాత్రమే కట్టిస్తారా.. ఇళ్లు కోల్పోతున్న 10 వేల మందికి కట్టిస్తారా అనేది చెప్పాలన్నారు. ముందు ఇళ్లు కట్టించాక కూల్చేస్తారా.. కూల్చిన తర్వాత కట్టిస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ముందే ఇళ్లు కూల్చివేస్తే బాధితులు ఎక్కడ ఉండాలని ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి..: Gas Cylinder Shortage | గ్యాస్ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు

