Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..

తెలంగాణహైదరాబాద్

Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..

హైడ్రా తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలు కడుతుంటే హైడ్రాకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 5:59 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Musi River Buildings

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Musi River Buildings | హైడ్రా తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలు కడుతుంటే హైడ్రాకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్​లోని మూసీ నది ప్రాంతంలో నిర్మిస్తున్న భవనాల వద్ద ఆందోళన చేపట్టారు.

Contents
  • Musi River Buildings | పేదల ఇళ్లను కూల్చారు..
    • Musi River Buildings | అందరికీ ఒకే న్యాయం ఉండాలి..

Musi River Buildings | పేదల ఇళ్లను కూల్చారు..

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం కుత్బుల్లాపూర్​లో పేదల ఇళ్లను, ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేసిందని మండిపడ్డారు. మూసీలో కూడా ఎంతో మంది పేదవాళ్ల ఇళ్లను కూల్చిన హైడ్రా, ప్రభుత్వానికి మాత్రం.. ఇదే నదిలో కడుతున్న భారీ బిల్డింగ్​లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​కు ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్​లో ఉన్నానని చెప్పారని.. ఆయన బుల్డోజర్లు తెచ్చే వరకు మేమంతా ఇక్కడే ఉంటామని వ్యాఖ్యానించారు. జనం బాటలో భాగంగా చెరువులు, నదులు ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్​ల గురించి ఫిర్యాదులు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Musi River Buildings

Musi River Buildings | అందరికీ ఒకే న్యాయం ఉండాలి..

గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారని కవిత మండిపడ్డారు. ఎంతో మంది మధ్య తరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్​మెంట్లు కొనుక్కున్నారని.. దాదాపు 20 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్ మెంట్ వాళ్లను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. కానీ ఇప్పుడిప్పుడే కడుతున్న ఈ బిల్డింగ్​ నిర్మాణాన్ని ఎందుకు ఆపడం లేదని నిలదీశారు. మాకు ప్రైవేట్ వాళ్లతో ఎలాంటి పంచాయితీ లేదని.. ప్రభుత్వంతోనేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్​ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు నిర్మాణాలను ఆపారన్నారు. కానీ ఆ తర్వాత ఆమ్యామ్యాలు తీసుకొని మళ్లీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే మా పోరాటమని స్పష్టం చేశారు. కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Census 2026 | మే 11 నుంచి జనగణన.. కలెక్టర్లకు సీఎస్​ సూచనలు

Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Nacharam Lake Development | నాచారం చెరువును అభివృద్ధి చేస్తాం : హైడ్రా క‌మిష‌న‌ర్‌
Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
Goa liquor smuggling | గోవా నుంచి మద్యం.. షాక్​ ఇచ్చిన పోలీసులు
Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
TAGGED:BRS PartyHyderabad newsHYDRAIllegal ConstructionsKavithaMusi RiverRiver EncroachmentsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BJP Rajya Sabha Candidates BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..
Next Article Kamareddy RTC Bus | Kamareddy RTC Bus | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?