అక్షరటుడే, వెబ్డెస్క్: Mutton Choking Death | మటన్ ముక్క ప్రాణం తీసింది. గొంతులో ముక్క ఇరుక్కొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా దామరవంచ శివారు పిల్లిగుండ్లతండా (Pilligundla Thanda)కు చెందిన బానోతు బిచ్చా (54) తన ఇంట్లో దుర్గమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నాడు. బంధువులు, కుటుంబ సభ్యులతో భోజనం చేస్తుండగా.. మటన్ ముక్క బిచ్చా గొంతులో ఇరుక్కుంది. ముక్క గొంతులో అడ్డుపడటంతో ఆయన ఊపిరి తీసుకోలేకపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి (Local Government Hospital)కి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పండుగ పూట ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
Mutton Choking Death | ఇలా చేయాలి
మాంసం తింటున్నప్పుడు గొంతులో ఇరుక్కొని చనిపోయిన ఘటనలు గతంలో సైతం చోటు చేసుకున్నాయి. ఆహారం సరిగా నమలకపోయినా.. ఆగమాగం తిన్నా.. శ్వాసనాళంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో శ్వాసనాళం మూసుకుపోయి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందదు. దీంతో మెదడుకు సైతం ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో పక్కన ఉన్నవారు సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. బాధితుడిని వెనక నుంచి పొత్తి కడుపు భాగంలో గట్టిగా పట్టుకోవాలి. అనంతరం అతడిని పైకి లేపుతూ ఒత్తిడి కలిగించాలి. అలాగే వీపుపై గట్టిగా తట్టడం చేయాలి. ఇలా చేస్తే గొంతులో ఇరుకున్న ఆహారం బయటకు వస్తుంది.
ఇది కూడా చదవండి..: Cyber Scam | ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా..
