అక్షరటుడే, వెబ్డెస్క్ : Nacharam Lake Development | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చెరువులకు హైడ్రా పూర్వ వైభవం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు చెరువులను పునరుద్ధరించి, ప్రారంభించింది. మరికొన్ని చెరువుల పనులు కొనసాగుతున్నాయి. రెండో విడతలో 14 చెరువులను పునరుద్ధరించనుంది.
ఉప్పల్ (Uppal) మండలంలోని నాచారం చెరువును అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) రంగనాథ్ తెలిపారు. మంగళవారం ఆయన చెరువును పరిశీలించారు. మొత్తం 108.30 ఎకరాలున్న నాచారం చెరువులో 81.12 ఎకరాలమేర గుర్రపు డెక్క పేరుకుపోయింది. చెరువులోని మురికి నీటిని కిందకు వదిలేసి పూడికను పూర్తిగా తొలగించాలని పనులు పర్యవేక్షిస్తున్న అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
Nacharam Lake Development | దోమలతో ఇబ్బందులు
నాచారం చెరువు పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరారు. మురుగునీరు కలవడంతో చెరువంతా గుర్రపుడెక్క వ్యాపించి దోమలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గతంలో ఎస్‌టీపీ పెట్టినా.. నేరుగా మురుగు నీరు కలిసిపోతోందని ఫిర్యాదు చేశారు.
Nacharam Lake Development | వరద ముప్పుపై అధ్యయనం
మల్కాజిగిరి (Malkajgiri) పరిధిలోని మీర్జాల్‌గూడ చిన్మయిమార్గ్ ప్రాంతాలను హైడ్రా అదనపు పరిశీలించారు. వర్షాకాలంలో వరదతో తమ ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయని స్థానికులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. వరద సాఫీగా వెళ్లకుండా కాలువలు కుంచించుకుపోయినట్టు గుర్తించారు. కాలువల విస్తరణ పనులను చేపడతామని.. అందరూ సహకరించాలని స్థానికులను హైడ్రా కమిషనర్ కోరారు.
దీనిని కూడా చదవండి : EV Discount Employees | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా డిస్కౌంట్

