Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nagpur Explosives Seizure | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Nagpur Explosives Seizure | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

జాతీయం

Nagpur Explosives Seizure | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

నాగ్​పూర్​లో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 4:06 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Nagpur Explosives Seizure

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nagpur Explosives Seizure | మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్​పూర్​లో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఇంట్లో జెలటిన్ స్టిక్స్, 58 డిటోనేటర్లు, అనేక కనెక్టర్లు, 15 లైవ్ కాట్రిడ్జ్‌లతో సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపింది.

నాగ్​పూర్​ (Nagpur)లోని సీఏ రోడ్డులోని దోసర్ భవన్ చౌక్‌లో ఉన్న ఒక ఇంటి చిన్న తోటలో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు (Bomb Disposal Squads), ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని వెంటనే దిగ్బంధించి, అదనపు పేలుడు పరికరాలు ఏమైనా ఉన్నాయేమోనని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో నాగ్‌పూర్‌లో భయాందోళనలు చెలరేగాయి. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు.

Nagpur Explosives Seizure | పోలీసుల దర్యాప్తు

అత్యంత భద్రత, సున్నితమైన ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి (RSS Headquarters) సమీపంలో ఈ పేలుడు పదార్థాలు లభించడంతో పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పేలుడు పదార్థాలను గత ఒకటిన్నర నెలలుగా అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది. సంచిలో ఉంచిన జిలాటిన్ స్టిక్స్ కనిపించడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పేలుడు పదార్థాలన్నింటినీ సురక్షితంగా స్వాధీనం చేసుకుని, రహస్య ప్రదేశానికి తరలించారు. అయితే వాటిని ఎవరు అక్కడ పెట్టారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్‌ డ్రోన్లు

I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..
India Advisory | ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష
Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన
TAGGED:Bomb Disposal SquadsBomb Squadexplosives seizureMaharashtraNagpurNagpur Explosives Seizurenagpur newsPolice investigationRSS Headquarters
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Police Health Camp Police Health Camp | పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య
Next Article Stock Market Gains Stock Market Gains | ఐటీలో దూకుడు.. నాలుగో రోజూ లాభాలే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?