Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ

జాతీయం

Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ

రంగులు చల్లాడని కోపంతో బామ్మ తన మనవడిపై మరుగుతున్న వేడి నీళ్లను కుమ్మరించడంతో బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 12:18 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Nagpur Incident
Nagpur Incident

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nagpur Incident | రంగుల పండుగ హోలీ సందర్భంగా మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తనపై రంగులు చల్లాడని కోపంతో ఓ బామ్మ నాలుగేళ్ల మనవడిపై మరుగుతున్న వేడి నీళ్లను కుమ్మరించింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Contents
  • Nagpur Incident | బాలుడి అరుపులు… ఆ తర్వాత
    • Nagpur Incident | బామ్మపై కేసు నమోదు

వివ‌రాల‌లోకి వెళితే నాగ్‌పూర్‌లోని కోరాడి ప్రాంతంలో హోలీ పండుగ (Holi Festival) సందర్భంగా పిల్లలు వీధిలో రంగులతో ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఒక బామ్మ వేడి నీళ్ల బకెట్ పట్టుకుని వీధి నుంచి ఇంట్లోకి వెళ్తుండగా ఆమె నాలుగేళ్ల మనవడు సరదాగా రంగులు చల్లాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తురాలైన బామ్మ, అడ్డుకునే ప్రయత్నంలో తన చేతిలో ఉన్న బకెట్‌లోని వేడి నీళ్లను బాలుడిపై కుమ్మరించింది. దీంతో బాలుడి శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి.

Nagpur Incident | బాలుడి అరుపులు… ఆ తర్వాత

వేడి నీళ్లు పడటంతో బాలుడు గట్టిగా అరవడంతో విషయం వెంటనే ఆమెకు అర్థమైంది. దీంతో ఆందోళన చెందిన బామ్మ పక్కనే ఉన్న బకెట్‌లోని చల్లని నీళ్లను తీసుకుని బాలుడిపై పోసింది. అయితే అప్పటికే బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడి అరుపులు విన్న‌ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. అనంతరం బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం బాలుడికి శరీరంలోని కొన్ని భాగాల్లో తీవ్రమైన కాలిన గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Nagpur Incident
Nagpur Incident

Nagpur Incident | బామ్మపై కేసు నమోదు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోరాడి పోలీసులు (Koradi Police) వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిపై వేడి నీళ్లు కుమ్మరించిన ఘటనకు సంబంధించి నిందితురాలైన బామ్మపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బకెట్‌లో వేడి నీళ్లు ఉన్న విషయం ఆమెకు మరిచిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు ముందు ఆమె రోడ్డుపై నీళ్లు చిమ్మడం, బకెట్‌లోని నీటిని రోడ్డుపై పారబోయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిన్నారుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. పండుగల సమయంలో పిల్లలు ఆడుకునే సమయంలో పెద్దలు మరింత జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

A shocking incident from Nagpur during Holi: An elderly woman allegedly poured hot water on a young boy who was playing. The video is now going viral on social media. pic.twitter.com/Qxv1EA6HNp

— VRF NEWS (@VRFNEWS) March 5, 2026

ఇది కూడా చదవండి..: Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్

Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
Khamenei Death Protests | ఖమేనీ హత్యపై భారత్‌లో నిరసనలు.. ప్రధాని మోడీ కీలక సమావేశం
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
TAGGED:boiling water incidentchild safety indiagrandmother attack grandsonHoli Festivalholi festival newsholi incident nagpurIndia crime newsKoradi PoliceMaharashtraNagpur Incidentnagpur newsshocking viral news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nitish Kumar Resigns Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
Next Article Nidhi Agarwal Nizamabad Nidhi Agarwal Nizamabad | ఇందూరులో మెరిసిన ’నిధి’
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?