అక్షరటుడే, ఇందూరు: Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్‌పోడ్ (Naikpod Community) రాష్ట్ర అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు కూన దయానంద్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు మెసిలేని రాజన్న, పళ్ల సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం డిచ్పల్లి మండలంలోని ధర్మారంలో సమావేశంలో మాట్లాడారు.
Naikpod Adhoc Committee | అత్యవసర సమావేశం
డిచ్పల్లి మండలంలోని (Nizamabad News) ధర్మారం శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో ఆదివాసీ నాయక్‌పోడ్ రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల (Telangana Tribal News) అత్యవసర సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు, గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి సంఘం బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు.
Naikpod Adhoc Committee | ప్రస్తుత కమిటీ..
ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు కూన దయానంద్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు మెసిలేని రాజన్న, పళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పసుల బుచ్చయ్య నేతృత్వంలోని కమిటీ ఆశించిన స్థాయిలో సంఘాన్ని (Tribal Welfare) ముందుకు తీసుకెళ్లడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ప్రస్తుత బాడీని రద్దు చేస్తున్నామని, త్వరలోనే నూతన రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని(Community Leadership) ఎన్నుకుంటామని ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర గిరిజన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, అధికారికంగా నూతన బాడీ ఎన్నిక ప్రక్రియను చేపడతామని స్పష్టం చేశారు.
Naikpod Adhoc Committee | అడ్‌హక్ కమిటీ ఏర్పాటు..
నూతనంగా ఏర్పడే రాష్ట్ర కార్యవర్గం.. గ్రామస్థాయి నుంచి కులస్థులను ఏకం చేయడమే కాకుండా, ప్రభుత్వం నుండి అందే సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా కృషి చేయాలని నాయకులు సూచించారు. ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు 13 జిల్లాల నుండి ఒక్కొక్క సభ్యుడితో కూడిన తాత్కాలిక ఆడహక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకగారి భూమయ్య, మొసలి చిన్నయ్య, గంజి రాజన్న, భూమయ్య, వేంపల్లి గంగాధర్, భీముడు, శంకర్, లింగన్న, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 30 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత

