అక్షరటుడే, ఆర్మూర్: Naikpod Community Development | ఆదివాసి నాయక్‌పోడ్ కుల వ్యవస్థ బలోపేతానికి (tribal development) కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని పెర్కిట్ శివారులో ఉన్న భీమన్న గుండి వద్ద జిల్లా ఆదివాసి నాయక్‌పోడ్ కులస్తుల సేవా సంఘం (community meeting) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
Naikpod Community Development | సంఘం సొంత భవనం కోసం వినతులు..
ఈ సందర్భంగా గాండ్ల రాంచందర్, బండారి భోజన్న మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ఆదివాసి నాయక్‌పోడ్ కులస్థులకు (tribal leaders) సంఘ భవనం లేదని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి త్వరలో కలిసి సంఘ భవన నిర్మాణానికి స్థలం, నిధులు మంజూరు చేయించే దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ స్థాయి నుంచి (Telangana news) మండల స్థాయి వరకు ఆదివాసి నాయక్‌పోడ్ కులస్థులను బలోపేతం (Adivasi welfare) చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన పేద కులస్థులకు చేరేలా కృషి (Naikpod community) చేస్తామన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ఉద్యోగులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Naikpod Community Development | రాబోయో రోజుల్లో భారీ మహాసభ
రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు 20వేల మంది ఆదివాసి నాయక్‌పోడ్ కులస్థులతో (social development) మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శివ శంకర్, ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొసెడుగు, అధికార ప్రతినిధి పుట్టా దుర్గ మల్లేష్, మండల కార్యవర్గ సభ్యులు సుమారు 30 మంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
