అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nandini Sidha Reddy | తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్ నందిని సిధారెడ్డి (Nandini Sidhareddy)కి వచన కవిత్వం భాగంలో అవార్డు వరించింది.
నందిని సిధారెడ్డి అనేక కవితలు, పాటలు రశారు. ఆయన రచించిన “అనిమేష” కవితా సంపుటికి కేంద్రం తాజాగా సాహిత్య అకాడమీ అవార్డు అందజేసింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులపై ఆయన దీనిని రచించారు.
Nandini Sidha Reddy | సిద్దిపేట జిల్లా
సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా (Siddipet District) కొండపాక మండలం మందం బందారం. 1955లో జన్మించిన ఆయన అధ్యాపకుడిగా జీవితాన్ని ఆరంభించారు. కవిత్వంపై తనకున్న మక్కువతో కవితలు రాసేవారు. ఆయన అనేక పాటలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సిధారెడ్డి రాసిని ‘నాగేటి సాలల్లో నా తెలంగాణ’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పాటకు నంది అవార్డు కూడా వచ్చింది.

Nandini Sidha Reddy | విద్యార్థి దశ నుంచే..
అధ్యాపకుడిగా సిధారెడ్డి మెదక్ (Medak)లో కొంతకాలం పని చేశారు. అనంతరం సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేసి 2012లో రిటైర్ అయ్యారు. విద్యార్థి దశ నుంచే ఆయన కథలు, కవిత్వం రాసేవారు. నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నిర్వహించారు. దాశరథి కృష్ణామాచార్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంజీరా రచయితల సంఘం కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి..: Jeevan Reddy Resignation | కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్న జీవన్‌రెడ్డి.. ఏ పార్టీలో చేరుతారో?

