అక్షరటుడే, ఆర్మూర్: Nandipet Hyderabad Bus | టీజీఎస్ఆర్టీసీ మెరుగైన సేవల్లో భాగంగా నందిపేట్ (Nandipet) నుంచి సూపర్‌లగ్జరీ బస్సును ప్రారంభిస్తున్నట్లు నిజామాబాద్ డిపో–1 మేనేజర్ ఆనంద్ పేర్కొన్నారు. నందిపేట్ బస్టాండ్ (Nandipet Bus Stand) ప్రజా సేవల మెరుగదలతో భాగంగా సర్పంచ్ లింగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Nandipet Hyderabad Bus | ప్రస్తుతం 19 సర్వీసులు..
ఈ సందర్భంగా మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నుంచి నందిపేట్ (Nizamabad to Nandipet)కు ప్రస్తుతం 19 సర్వీసులు నడుస్తున్నాయన్నారు. అలాగే నందిపేట్ మండల పరిధిలో మరో 12 బస్సులు నడుస్తున్నట్లు తెలిపారు. 22 గ్రామ ప్రజల అభ్యర్ధన మేరకు నందిపేట్ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు సేవను ప్రారంభించినట్లు వెల్లడించారు.
Nandipet Hyderabad Bus | టీజీఆర్టీసీ సేవలకు కృతజ్ఞతలు..
నందిపేట్ సర్పంచ్ ఎర్ర లింగం మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందిస్తున్న ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నందిపేట్ ప్రాంతానికి పెంచిన బస్సు సర్వీసులు, హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు (Super Luxury Bus) ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అదేవిధంగా క్యాషెస్ (నగదురహిత) విధానాన్ని కూడా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. నందిపేట్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: EMRS Gandhari Jobs | గాంధారి ఏకలవ్య గురుకులంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

