Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు

క్రీడలు

Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చిన అభిమానులకు అక్కడి ధరలు షాక్‌కు గురిచేశాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 1:25 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Narendra Modi Stadium Water Price
Narendra Modi Stadium Water Price

అక్షరటుడే, వెబ్​డెస్క్: Narendra Modi Stadium Water Price | టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన ఈ వేదికలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

Contents
  • Narendra Modi Stadium Water Price | మరీ ఇంత దోపిడా…
    • Narendra Modi Stadium Water Price | క్రికెట్ అభిమానుల ఆవేదన

అయితే మ్యాచ్ ఉత్సాహంతో వచ్చిన అభిమానులకు స్టేడియం లోపల విక్రయించిన వస్తువుల ధరలు మాత్రం పెద్ద షాక్ ఇచ్చాయి.సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారిన ఒక వీడియో ప్రకారం, స్టేడియం లోపల సాధారణంగా బయట మార్కెట్‌లో కేవలం రూ.20కే లభించే ఒక లీటర్ మంచినీళ్ల బాటిల్‌ను అక్కడి వెండర్లు రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది.

Narendra Modi Stadium Water Price | మరీ ఇంత దోపిడా…

వీడియోలో ఒక అభిమాని నీళ్ల బాటిల్ ధర అడగగా, అక్కడి సిబ్బంది నిర్మొహమాటంగా రూ.200 అని చెప్పడం కనిపిస్తోంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టేడియం యాజమాన్యం మాత్రం తాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంచామని చెబుతోంది. కానీ స్టేడియంలో ఎక్కడా ఉచిత నీటి సౌకర్యం కనిపించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో స్టేడియం కిక్కిరిసిపోవడం, భద్రతా కారణాల దృష్ట్యా బయటి నుంచి నీళ్ల బాటిళ్లను అనుమతించకపోవడం విక్రేతలకు అవకాశం కల్పించిందని వారు అంటున్నారు.

Narendra Modi Stadium Water Price | క్రికెట్ అభిమానుల ఆవేదన

నీళ్ల బాటిళ్లతో పాటు స్నాక్స్, కూల్‌డ్రింక్స్ ధరలు (Prices of Cold Drinks) కూడా సాధారణ మార్కెట్ ధరల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిమానులు తెలిపారు. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసి, హోటళ్లలో బుకింగ్స్ చేసి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన తమకు కనీసం మంచినీరు కూడా సరసమైన ధరలకు అందించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఈ ఘటనపై సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్టేడియం నిర్వహణపై చర్యలు తీసుకోవాలని, ప్రేక్షకులకు కనీస అవసరాలైన తాగునీరు వంటి సేవలు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: India T20 Final | ఫైనల్​లో దంచికొట్టిన భారత్​.. కివీస్​ లక్ష్యం 256

India T20 Semifinal | కరేబియన్​ జట్టుపై ఘన విజయం.. సెమీ ఫైనల్​లోకి భారత్​
GVCC Cricket Championship | 3వ జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్.. ఆర్కిటెక్ట్‌లు డిజైనర్ల కలయిక
Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్… ఆరు నెలలుగా మద్యానికి దూరం
Jasprit Bumrah Injury | ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్.. గాయంతో ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్..?
Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
TAGGED:ahmedabad stadium newscricket fans outragenarendra modi stadiumPrices of Cold DrinksSocial Mediasports event indiastadium food pricesT20 World CupT20 World Cup Finalviral stadium videowater bottle price stadium
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article India Gas Shortage India Gas Shortage | గ్యాస్​ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక చర్యలు
Next Article Telangana New Governor Telangana New Governor | నూతన గవర్నర్​కు స్వాగతం పలికిన సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?