అక్షరటుడే, వెబ్‌డెస్క్: Narhari Zirwal Video | మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ (Maharashtra Minister Narhari Zirwal) వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రాన్స్‌జెండర్‌తో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నరహరి జిర్వాల్ మహారాష్ట్ర ఆహార, ఔషధాల నియంత్రణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన తన అధికారిక నివాసంలో ఓ ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు జరిపిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మంత్రివర్గం నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేసింది. కాగా దీనిపై మంత్రి స్పందిస్తూ.. బ్లాక్‌మెయిల్ కోసం వీడియో రిలీజ్ చేశారని పేర్కొన్నారు. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అన్నారు.
Narhari Zirwal Video | ఎన్సీపీ నుంచి..
నాసిక్ జిల్లాలోని డిండోరీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్సీపీ నుంచి నరహరి విజయం సాధించారు. అనంతరం మంత్రి పదవి దక్కించుకున్నారు. గిరిజన నేతగా ఆయనకు పేరుంది. తాజాగా ట్రాన్స్‌జెండర్ ఉమెన్‌తో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అధికార కూటమిలోని కలహాల వల్లే ఈ వీడియో బయటకు వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.
Narhari Zirwal Video | నైతిక పతనానికి ప్రతిబింబం
జిర్వాల్ ఒక ట్రాన్స్‌జెండర్‌తో ఉన్నారని, బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆమె సోదరుడు ఆ వీడియోను వైరల్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఈ సంఘటనను రాష్ట్ర రాజకీయాల్లో నైతిక పతనానికి ప్రతిబింబంగా అభివర్ణించారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఇలాంటి అసభ్యకరమైన, అనైతిక ప్రవర్తనకు పాల్పడటం సరికాదన్నారు. ఇది ప్రజా జీవితానికి ఒక మచ్చ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్రం

