Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Narsingi Tragedy | హైదరాబాద్​లో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Narsingi Tragedy | హైదరాబాద్​లో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం

హైదరాబాద్క్రైం

Narsingi Tragedy | హైదరాబాద్​లో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం

హైదరాబాద్​లోని నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై హత్యాచారం చేశాడు.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 3:59 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Narsingi Tragedy

అక్షరటుడే, వెబ్​డెస్క్: Narsingi Tragedy | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు.

Contents
  • Narsingi Tragedy | సీసీ ఫుటేజీ ఆధారంగా..
    • Narsingi Tragedy | కఠిన చర్యలు అవసరం

నగరంలోని నార్సింగి (Narsingi)లో ఓ యువకుడు ఆరేళ్ల బాలికకు చాక్లెట్​ ఇప్పిస్తానని ఆశ చూపించాడు. చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం హత్య చేశాడు. బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Narsingi Tragedy | సీసీ ఫుటేజీ ఆధారంగా..

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు (Narsingi Police) కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఓ వ్యక్తి బాలికను తీసుకు వెళ్తున్నట్లు ఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో హత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. రాత్రి ఒంటి గంట సమయంలో బాలిక మృతదేహాన్ని పోలీసులకు చూయించాడు. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Narsingi Tragedy | కఠిన చర్యలు అవసరం

ఇటీవల చిన్నారులపై లైంగిక దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది కామాంధులు బాలికపై కన్నేస్తున్నారు. ఎవరు లేని సమయంలో మాయమాటలు చెప్పి చిన్నారులను తీసుకెళ్తున్నారు. అనంతరం లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కొందరు దుర్మార్గులు హత్యలు సైతం చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని మదనపల్లిలో ఏడేళ్ల బాలిక హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలపై లైంగిక దాడులు చేసే వారిని ఉరి తీయాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు

Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం
Sharada Peeth Demolition Row | శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: హరీశ్​ రావు
HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ
Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
Road Accident on NH44 | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రావెల్స్​ బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం
TAGGED:HyderabadNarsingiNarsingi PoliceNarsingi Tragedy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Field Visits by Officers Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
Next Article Nandini Sidha Reddy Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?