అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: National Lok Adalat | లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

National Lok Adalat | రాజీ మార్గమే రాజమార్గం..
చాలామంది ప్రజలు న్యాయ సంబంధిత సమస్యలను తేల్చుకోలేక ఇబ్బందులు పడుతుంటారని వారికి పరిష్కార మార్గం చూపిందుకే లోక్ అదాలత్ (Lok Adalat)ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని సాయి చైతన్య పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించే జాతీయలోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నచిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు లోక్ అదాలత్‌లో పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. దీనికి సంబంధించి పోలీస్‌శాఖ (Police Department) తరపున ఏర్పాట్లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి

