అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్‌లో (National Lok Adalat) 5,662 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
National Lok Adalat | జిల్లావ్యాప్తంగా ఆయా కేసుల్లో..
ఈ సందర్భంగా సీపీ లోక్ అదాలత్‌లో కేసుల వివరాలను వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన (Telangana police) వారికి రూ.31,82,649 తిరిగి బాధితులకు అందజేశామన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన, రాజీపడదగిన కేసులను పరిష్కరించామన్నారు. అదాలత్‌లో కేసుల పరిష్కారంలో జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైం సిబ్బంది, కోర్టు సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
National Lok Adalat | క్షణికావేశంలో జరిగే తప్పులను..
క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని సీపీ అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందుల పాలు చేసుకోకూడదని (Lok Adalat cases) సూచించారు. రాజీమార్గమే రాజమార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో (legal settlements India) ఇరువర్గాలు రాజీపడవచ్చని తెలిపారు. ముఖ్యంగా సైబర్ (law and justice India) బాధితులకు సత్వర న్యాయం చేయాలని, టీఎస్‌సీఎస్‌బీ (తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో) డైరెక్టర్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో ఏడు కమిషనరేట్ల పరిధిలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లు, ప్రతిజిల్లాలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి డీఎస్పీ స్థాయి అధికారులతో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy | కేసీఆర్ అందుకే సభకు రావడం లేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
