Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి

నిజామాబాద్

National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి

విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపి అన్నారు. నగరంలోని శంకర్​భవన్​లో వ్యాసరచన పోటీలో విజేతలకు డిక్షనరీలు అందజేశారు.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 28, 2026 8:52 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
National Science Day celebration |
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపి

అక్షరటుడే, ఇందూరు: National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపి అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం(National Science Day celebration) సందర్భంగా స్థానిక శంకర్​భవన్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్​ఎం సాయన్న సహకారంతో విద్యార్థులకు సైన్స్ ప్రాముఖ్యతపై (Scientific temper awareness) వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న 42మంది విద్యార్థులకు డిక్షనరీలు బహుమతిగా అందజేశారు.

Contents
  • National Science Day celebration | జాతీయ సైన్స్​ దినోత్సవం..
    • National Science Day celebration |విద్యార్థులు ఇప్పటినుంచే..

National Science Day celebration | జాతీయ సైన్స్​ దినోత్సవం..

ఈ సందర్భంగా రామర్తి గోపి మాట్లాడుతూ సీవీ రామన్‌గా పేరుగాంచిన ప్రముఖ భౌతికశాస్త్ర పరిశోధకుడు చంద్రశేఖర్ వెంకటరామన్ 1928 ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్‌ కనుగొనడంతో (CV Raman discover) ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. అంతరిక్ష పరిశోధనలు చూడాలన్నా.. వ్యవసాయంలో యాంత్రికరణ సంతరించుకోవాలన్నా, వైద్య ఆరోగ్య రంగం ఆయుష్షు పెంచుకోవాలన్నా, శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక పరిశోధనలే (Science education India) మూలమని ఆయన పేర్కొన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో వైజ్ఞానిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని వాటన్నింటిని విద్యార్థులు అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.

National Science Day celebration |విద్యార్థులు ఇప్పటినుంచే..

విద్యార్థులు ఇప్పటినుండే వారిలో ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను సృజనాత్మకతను వెలికి తీయాలని రామర్తి గోపి అన్నారు. విద్యార్థులలోని శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక అంశాలపై ఉన్న అభిరుచిని ఉపాధ్యాయులు గుర్తించి వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను కోరారు. పాఠశాలలో ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని వారి సహకారంతో ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆయన తెలిపారు.

శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగంలో దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపడానికి విద్యార్థులుగా ఇప్పటినుండే సంసిద్ధులుగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సకినాల శివప్రసాద్, ప్రమోద్, జగడం సుమన్, బాల్ రెడ్డి, కిషోర్, నందకిషోర్, రంజిత్, గురిజాల హరీష్, ఎన్​ఎస్​యూఐ కౌశిక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

science2

ఇది కూడా చదవండి: HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ

Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు
Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
Ramzan celebrations MLAs | రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..
Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..
TAGGED:Congress party leadersCV Raman discoveryNational Science Day celebrationScience education IndiaScientific temper awarenessStudent essay competitionTelangana school events
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ACB Bribery Arrest ACB Bribery Arrest | పోస్టుమార్టం రిపోర్ట్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన హోంగార్డు
Next Article Dubai Iran Attacks Dubai Iran Attacks | దుబాయ్​పై ఇరాన్​ దాడులు.. బుర్జ్​ ఖలీఫా ఖాళీ
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?