అక్షరటుడే, కామారెడ్డి : National seminar NEP 2020 | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government degree college kamareddy) రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సెమినార్ శనివారం ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ముగింపు వేడుకలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ నాయుడు అశోక్, తెలంగాణ విశ్వవిద్యాలయ(Telangana university events) ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
National seminar NEP 2020 | భారతీయ విద్యావ్యవస్థను..
సభ ప్రారంభానికి ముందు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాయుడు అశోక్ మాట్లాడుతూ.. ఎన్ఈపీ 2020 కేవలం ఒక విద్యా విధానం మాత్రమే కాదని, (Kamareddy college news) ఇది భారతీయ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక మార్గదర్శి అన్నారు. ముఖ్యంగా గాంధీజీ కలలుగన్న ‘నయీ తాలిం’ అనుభవపూర్వక అభ్యాసం ఛాయలు ఈ విధానంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
National seminar NEP 2020 | మన మూలాలను మరిచిపోవద్దు..
ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచీకరణ కాలంలో మన మూలాలను మరిచిపోకుండా, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. మాతృభాషలో విద్యాబోధన, వృత్తి విద్యా కోర్సుల అనుసంధానం ద్వారా విద్యార్థులు స్వయం సమృద్ధి సాధించవచ్చన్నారు. అనంతరం సెమినార్ కన్వీనర్ నివేదికను డాక్టర్ కె. కిష్టయ్య రెండు రోజుల చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో సమర్పించారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా కళాశాల విద్యార్థులు తయారు చేసిన వాటిలో మహిళా సాధికారిక విభాగం నుండి జూట్ బ్యాగులు, రసాయన శాస్త్ర విభాగం నుంచి హోమ్ నీడ్స్, మత్స్య శాస్త్ర విభాగం నుంచి ఎక్వేరియం అతిథులకు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

