అక్షరటుడే, వెబ్‌డెస్క్: NATO Alliance | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాటోపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “నాటో నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. అది ఎప్పటినుంచో ‘పేపర్ టైగర్’ అని నాకు తెలుసు” అన్నారు. ఈ రక్షణ ఒప్పందం నుంచి వైదొలగడంపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.
NATO Alliance | నాటో కూలిపోతుందా..?
నాటో నుంచి బయటపడాలని అమెరికా బలంగా ఆలోచిస్తోందని ట్రంప్ పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చకు తెరలేపింది. అంతేకాకుండా నాటోను ‘పేపర్ టైగర్’ అని అభివర్ణించడంతో నాటో విచ్ఛిన్నమవుతుందా అనే చర్చ సాగుతోంది. ఇరాన్‌తో సంఘర్షణల నేపథ్యంలో మిత్రదేశాలు తమవైపు కలిసి రావాలని కోరారు. అయినా ఆయా దేశాలు స్పందించకపోవడం, హార్ముజ్ జలసంధిని సైనికంగా తెరవడంలో సహకరించకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
NATO Alliance | తమకు తాము పోరాడడం నేర్చుకోండి: ట్రంప్
బ్రిటన్‌తో సహా ఇతర మిత్రదేశాలను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. హార్ముజ్ జలసంధి వల్ల జెట్ ఇంధనం కొరత ఎదుర్కొంటున్న ఆ దేశాలు తమ సొంత ఇంధనాన్ని తామే సమకూర్చుకోవాలని, తమకు తాము పోరాడడం నేర్చుకోవాలని సూచించారు. అమెరికా ఇక మీకు సహాయం చేయదు. ఎందుకంటే మీరు మాకు సహాయం చేయలేదు కాబట్టి” అని ఆయన తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్టు చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమెరికా-యూరప్ మధ్య రక్షణ సహకారం ఇక ముందు ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
“All of those countries that can’t get jet fuel because of the Strait of Hormuz, like the United Kingdom, which refused to get involved in the decapitation of Iran, I have a suggestion for you…” – President Donald J. Trump pic.twitter.com/aPYmL0qspa
— The White House (@WhiteHouse) March 31, 2026
ఇది కూడా చదవండి..: Trump War Statement | యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
