Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: NDRF Mock Drill | విపత్తు సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్​ బృందాల మాక్​డ్రిల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - NDRF Mock Drill | విపత్తు సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్​ బృందాల మాక్​డ్రిల్

నిజామాబాద్

NDRF Mock Drill | విపత్తు సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్​ బృందాల మాక్​డ్రిల్

వరదలు, అకాల వర్షాలతో వచ్చే విపత్తుల సమయంలో తీసుకునే సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్ బృందాలు బుధవారం కామారెడ్డి పెద్ద చెరువులో మాక్ డ్రిల్ చేపట్టాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 3:55 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
NDRF Mock Drill

అక్షరటుడే, కామారెడ్డి: NDRF Mock Drill | వరదలు, అకాల వర్షాలతో వచ్చే విపత్తుల సమయంలో తీసుకునే సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్ బృందాలు బుధవారం కామారెడ్డి (Kamareddy) పెద్ద చెరువులో మాక్ డ్రిల్ చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వయంగా పరిశీలించారు.

Contents
  • NDRF Mock Drill | వరద పరిస్థితుల్లో..
    • NDRF Mock Drill | మాక్​ డ్రిల్​ ద్వారా అప్రమత్తత..

NDRF Mock Drill | వరద పరిస్థితుల్లో..

ఈ సందర్భంగా వరద పరిస్థితుల్లో రక్షణ చర్యలు, శాఖల మధ్య సమన్వయం, స్పందన సామర్థ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా మాక్ డ్రిల్‌ నిర్వహించినట్లు కలెక్టర్​ తెలిపారు. వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించే విధానాలను ప్రదర్శిస్తూ రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్ల సహాయంతో రక్షణ వంటి పద్ధతులను చూపించాయన్నారు. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో 12 శాఖలు, 187 మంది సిబ్బంది పాల్గొన్నాయని కలెక్టర్​ (Collector Ashish Sangwan) తెలిపారు. విపత్తు సమయంలో సమన్వయం, తక్షణ స్పందన, ప్రజల అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. మాక్ డ్రిల్ ద్వారా ప్రజల రక్షణపై అవగాహనప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఎలా సురక్షితంగా రక్షించాలో తెలియజేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు.

NDRF Mock Drill

NDRF Mock Drill | మాక్​ డ్రిల్​ ద్వారా అప్రమత్తత..

మాక్ డ్రిల్‌ (Mock Drill)ల ద్వారా ప్రజల్లో అప్రమత్తత పెంపొందించడం ముఖ్యమని కలెక్టర్​ తెలిపారు. విపత్తు సంభవించినప్పుడు భయపడకుండా, సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గించవచ్చన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ రక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇటువంటి మాక్ డ్రిల్‌ల ద్వారా ప్రజలకు , అధికారులకు విపత్తు సమయంలో ఎలా స్పందించాలో స్పష్టమైన అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి, డిప్యూటీ కమాండర్ డోల్ సింగ్, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం, జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్, ఆర్డీవో వీణ , తహశీల్దార్ హిమబిందు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nandipet Hyderabad Bus | నందిపేట్​ నుంచి హైదరాబాద్​కు సూపర్​ లగ్జరీ బస్సు ప్రారంభం

LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
Nizamabad Collector Inspection | మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
TAGGED:Collector Ashish Sangwandisaster responseemergency preparednessflood rescue trainingKamareddyKamareddy NewsMock DrillNDRF Mock DrillPublic Safety Indiarescue operations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nandipet Hyderabad Bus Nandipet Hyderabad Bus | నందిపేట్​ నుంచి హైదరాబాద్​కు సూపర్​ లగ్జరీ బస్సు ప్రారంభం
Next Article Chicken Shops Bandh Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?