అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepali Gang Theft | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ (Nepali Gang) రెచ్చిపోయింది. జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో చోరీ చేసింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో పనిమనుషులుగా చేరిన నేపాలీ దంపతులు యజమాని లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి భారీ ఎత్తున బంగారు, డైమండ్ ఆభరణాలు చోరీ చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 25లో పింగళి అనురుధ్ రెడ్డి అనే వ్యాపారి తన భార్య దీపికారెడ్డితో కలిసి నివసిస్తున్నాడు. 45 రోజుల క్రితం వారి ఇంట్లో నేపాల్‌కు చెందిన మహేష్ షాయి(30), అప్సర(25) అనే దంపతులు పనిమనుషులుగా చేరారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం అనురుధ్‌రెడ్డి దంపతులు ఇంటికి తాళం వేసి ఊటికి వెళ్లారు. పని మనుషులుగా చేరిన మహేష్, అప్సర గతంలోనే రెక్కీ నిర్వహించారు.
Nepali Gang Theft | అర్ధరాత్రి వెళ్లి..
యాజమానులు లేని సమయం చూసి శుక్రవారం రాత్రి కత్తులు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు ఇంట్లోకి చొరబడ్డారు. తాళాలు పగుట కొట్టి లాకర్లలో ఉన్న 8 డైమండ్ నెక్లెస్‌లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగలను బ్యాగ్‌లో సర్దుకుని పారిపోయారు. ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్ తాళాలు పగిలి ఉండటం గమనించి యజమానికి సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరిని పనిలో పెట్టిన పాత పనిమనుషులు హరత్‌సింగ్, రీమాసింగ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా చోరీకి గురైన సొత్తు విలువ రూ.రెండు కోట్ల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Nepali Gang Theft | గతంలో సైతం..
నగరంలో నేపాలీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఇటీవల ఇలాంటి చోరీలు పెరిగాయి. ముందుగా పని మనుషులుగా చేరి అదును చూసి చోరీ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం సికింద్రాబాద్ (Secunderabad) కార్ఖానాలో సైతం నేపాలీ దంపతులు పని మనుషులుగా చేరి యజమాని ఇంట్లో చోరీ చేశారు. రిటైర్డ్ కల్నల్ కిరణ్ ఇంట్లో పనిలో చేరిన ఆ జంట.. ఇంట్లో ఉన్నవారికి మత్తు పదార్థం కలిపిన డ్రింక్ ఇచ్చింది. వారు మత్తులోకి జారుకోగానే మరో నలుగురితో కలిసి చోరీ చేశారు. 20 తులాల బంగారం, లక్ష రూపాయల నగదుతో పరారు అయ్యారు.

Nepali Gang Theft | జాగ్రత్తలు అవసరం
పని మనుషులను పెట్టుకునే విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ఇటీవల నేపాలీ గ్యాంగ్‌లు నగరంలో పని మనుషులుగా చేరి చోరీలకు పాల్పడుతున్నారు. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు తెలిసిన వారినే పనిలో పెట్టుకోవాలి. ఇతర రాష్ట్రాలు, దేశాల వారిని పెట్టుకుంటే వారి అడ్రస్, ఇతర వివరాలు తీసుకోవాలి.
దీనిని కూడా చదవండి : Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

