అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New DGP Selection | నూతన డీజీపీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం డీజీపీగా శివధర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. దీంతో కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం నలుగురి పేర్లను యూపీఎస్సీకి పంపినట్లు సమాచారం.
నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) యూపీఎస్సీకి జాబితా పంపించగా.. అందులో ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఆ నలుగురిలో సీనియర్ అధికారి పోలీస్ బాస్ కానున్నారు. అయితే ప్రభుత్వం డీజీపీ నియామకంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (IPS officer CV Anand)ను డీజీపీగా చేయనున్నట్లు సమాచారం.
New DGP Selection | ఢిల్లీలో సమావేశం
డీజీపీ నియామకంపై బుధవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ వైపు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పోస్టు కోసం సీవీ ఆనంద్‌తో పాటు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్ పేర్లను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ ఎంప్యానెల్ కమిటీ సభ్యుల భేటీ అయి వీరిలో ముగ్గురి పేర్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. అందులో ఒకరిని డీజీపీగా నియమిస్తారు.
New DGP Selection | 2028 జూన్ వరకు
హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ (1991) 2028 జూన్ వరకు సర్వీస్‌లో ఉంటారు. 1994 బ్యాచ్‌కు చెందిన వీపీ ఆప్టే ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నారు. ఆయన 2029 అక్టోబర్ వరకు, జైళ్లశాఖ డీజీపీగా ఉన్న సౌమ్యామిశ్రా (1994) 2027 డిసెంబరు వరకు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌గా పనిచేస్తున్న శిఖాగోయల్ (1994) 2029 మార్చి వరకు సర్వీసులో ఉంటారు. వీరిలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ను డీజీపీగా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత

