అక్షరటుడే, ఇందూరు: Nidhi Agarwal Nizamabad | నగరంలోని రాష్ట్రపతి రోడ్డులో ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూంను గురువారం ప్రారంభించారు. ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించి సందడి చేశారు.

Nidhi Agarwal Nizamabad | తరలివచ్చిన అభిమానులు..
హీరోయిన్ నిధి అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అభిమానులకు అభివాదం చేస్తూ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) కాసేపు సందడి చేసింది. షో రూంలోని అన్ని విభాగాలను ప్రారంభించి సిబ్బందితో ఫొటోలకు ఫోజు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో (Nizamabad) ఆర్‌ఎస్‌బ్రదర్స్ మొదటి షోరూం ప్రారంభించామని నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరారు. కాగా.. హీరోయిన్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో షోరూం (RS Brothers Showroom) ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్

