అక్షరటుడే, కామారెడ్డి: Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేసింది. పట్టణంలోని (Kamareddy event) నిజాంసాగర్ చౌరస్తా రోడ్డులో నూతనంగా విశాల షాపింగ్ మాల్ (Vishala Shopping Mall) ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ (Nidhi Agerwal) హాజరయ్యారు.
Nidhi Agerwal Kamareddy Visit | తరలివచ్చిన అభిమానులు
హీరోయిన్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దఎత్తున షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. అభిమాన నటిని చూసేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం 10:30 గంటలకు రావాల్సిన నటి మధ్యాహ్నం 12:00 గంటలకు చేరుకున్నారు. సుమారు రెండు గంటలు జనాలు ఎండలో వేచి ఉన్నారు. నిధి అగర్వాల్ షాపింగ్ (celebrity appearance India) మాల్ వద్దకు చేరుకోగానే అభిమానులకు(crowd gathering news) అభివాదం చేస్తూ లోపలికి వెళ్లి జ్యోతి ప్రజ్వలన (local news Telangana) చేసి మాల్‌ను ప్రారంభించారు. పలువురు నిధి అగర్వాల్‌తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. హీరోయిన్ రాక సందర్భంగా జనాల రద్దీతో ఒకవైపు ట్రాఫిక్ నిలిపివేశారు. నిజాంసాగర్ నుంచి బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలను లయోల స్కూల్ ముందు రోడ్డు నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా పోలీసులు దారి మళ్లించారు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరోయిన్ వెళ్లాక మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి.
ఇది కూడా చదవండి: Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి
