అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nishant Kumar JDU | బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి (Nishant Kumar JDU) ఎంట్రీ ఇచ్చారు. జనతా దళ్ యూనైటెడ్ (జేడీయూ) పార్టీలో ఆదివారం అధికారికంగా చేరారు. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన నిశాంత్ ఇన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇది పార్టీలో కొత్త తరం నాయకత్వానికి మార్గం సుగమం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Nishant Kumar JDU | ఉత్సాహంగా చేరిక కార్యక్రమం
బీహార్ రాజధాని పాట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిశాంత్‌ను పార్టీలోకి (Nishant Kumar JDU) చేర్చుకున్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ‘లలన్’, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా సహా ప్రముఖ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. వేల మంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు.
పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం: నిశాంత్
పార్టీ సభ్యత్వం స్వీకరించిన అనంతరం నిశాంత్ కుమార్ మాట్లాడారు. తన తండ్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తున్నట్లు చెప్పారు. “ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం. మేం దానిని గౌరవిస్తాం. ఆయన మార్గదర్శకత్వంలో పని చేస్తాం. పార్టీని సంస్థాగత నిర్మాణం చేపట్టి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను” అని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు
గత ఇరవై ఏళ్లుగా బీహార్‌కు సేవలందించిన తన తండ్రి నీతీశ్ కుమార్‌ను రాష్ట్ర ప్రజలు ఎన్నిటికీ మరిచిపోలేరని నిశాంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని శాశ్వతంగా గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం
నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే నిశాంత్ చేరిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. అయితే నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా తప్పుకున్న అనంతరం నిశాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నితీశ్ కుమారుడు నిశాంత్ జేడీయూ పార్టీలో చేరడంతో కొత్త ఊపు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని అంచనా వేస్తున్నారు.
VIDEO | Patna, Bihar: JD(U) leader Nishant Kumar says, “I thank you all for being here… I will strive to work for the party as an active member. It was my father’s personal decision to go to the Rajya Sabha. I accept and respect his decision. We will work in the guidance of my… https://t.co/rj2Q9PGFVi pic.twitter.com/n9UY1gOvCd
— Press Trust of India (@PTI_News) March 8, 2026
ఇది కూడా చదవండి..:Nitish Kumar Resigns | బీహార్‌లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్

