Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nitish Kumar Reddy  | నితీష్ కుమార్ రెడ్డి అదిరిపోయే కమ్‌బ్యాక్.. నా మైండ్ నిండా నెగెటివ్ ఆలోచ‌న‌లే ఉండేవంటూ కామెంట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Nitish Kumar Reddy  | నితీష్ కుమార్ రెడ్డి అదిరిపోయే కమ్‌బ్యాక్.. నా మైండ్ నిండా నెగెటివ్ ఆలోచ‌న‌లే ఉండేవంటూ కామెంట్

క్రీడలు

Nitish Kumar Reddy  | నితీష్ కుమార్ రెడ్డి అదిరిపోయే కమ్‌బ్యాక్.. నా మైండ్ నిండా నెగెటివ్ ఆలోచ‌న‌లే ఉండేవంటూ కామెంట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 3, 2026 10:24 ఉద.
Srinivas Kolluri
16 గంటలు ago
Share
Nitish Kumar Reddy

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nitish Kumar Reddy | ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్​పై (Kolkata Knight Riders)  65 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Contents
  • Nitish Kumar Reddy | నితీష్ ఎమోషనల్ కామెంట్స్
    • Nitish Kumar Reddy | ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేసిన నితీష్

ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్, బాల్ రెండింటితోనూ మెరిసి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. 39 కీలక పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి జట్టుకు విజయం అందించాడు. ఈ ప్రదర్శనకు గాను అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Nitish Kumar Reddy | నితీష్ ఎమోషనల్ కామెంట్స్

అవార్డు అందుకుంటూ నితీష్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. గత సీజన్‌లో తన ఫామ్ కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని చెప్పాడు. పాజిటివ్‌గా ఉండటానికి చాలా ప్రయత్నించాను. కానీ నా మైండ్ నిండా నెగిటివ్ ఆలోచనలే ఉండేవి. గత ఏడాది నేను నా స్థాయిలో ఆడలేకపోయాను. ముఖ్యంగా బౌలింగ్‌లో చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దక్కింది. నన్ను ఫిట్‌గా ఉంచిన నా ట్రైనర్, ఫిజియోలకు ధన్యవాదాలు” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఓపెనర్లు ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. పవర్‌ప్లేలోనే 84 పరుగులు బాదడంతో భారీ స్కోరు దిశగా పయనించారు.

Nitish Kumar Reddy | ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేసిన నితీష్

ట్రావిస్ హెడ్ 46, అభిషేక్ శర్మ (Abhishek Sharma) 48 పరుగులతో జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ 52 పరుగులతో మెరుపులు మెరిపించగా, నితీష్ కీలకంగా 39 పరుగులు జోడించాడు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ మంచి ఆరంభం ఇచ్చినా, మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో గెలుపు దూరమైంది. అంగ్‌క్రిష్ రఘువంశీ 52, రింకూ సింగ్ (Rinku Singh) 35 పరుగులతో కొంత పోరాటం చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చివరికి 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయి 65 పరుగుల తేడాతో ఓటమి చవిచూశారు. కాగా, ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేసిన నితీష్, 2024లో అద్భుత ప్రదర్శనతో స్టార్‌గా ఎదిగాడు. అయితే 2025 సీజన్‌లో ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు 2026లో ఈ ప్రదర్శనతో బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు.

ఇది కూడా చదవండి..: PSL Ball Tampering | పీఎస్ఎల్ 2026లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. వీడియోలో అడ్డంగా దొరికిన స్టార్ ప్లేయ‌ర్

Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన‌ భారత్.. న‌మోదైన రికార్డులు ఇవే..!
BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!
Sanju Samson 97 | సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై థ్రిల్లింగ్ విజయం
Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు
TAGGED:Abhishek SharmaKolkata Knight RidersNitish Kumar ReddyRinku Singhsunrisers hyderabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Randy George Removal Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు
Next Article Badapahad bus accident Badapahad bus accident | బడాపహాడ్ యాత్రికుల బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?