అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nitish Kumar Resigns | బీహార్ రాజకీయాల్లో (Bihar Politics) కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్‌కుమార్ రాజీనామా చేయనున్నారు. ఆయనను రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ మేరకు నితీశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) అధికార ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 89, జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ (BJP) ఎక్కువ సీట్లు సాధించిన ముందు చెప్పినట్లుగానే నితీశ్కుమర్కు సీఎం పగ్గాలు అప్పగించింది. అయితే తాజాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నితీశ్‌కుమార్ పెద్దల సభకు వెళ్లనున్నారు. ప్రజల మద్దతుతో బిహార్‌కు రెండు దశాబ్దాలుగా సేవ చేసినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ప్రజల్లోనే ఉంటానని, బీహార్‌కు త్వరలో కొత్త సీఎం వస్తారని ఆయన ఎక్స్‌లో ప్రకటించారు.
Nitish Kumar Resigns | నాలుగు సభల్లో..
నితీశ్‌కుమార్ (Nitish Kumar) గతంలో ఎంపీగా పని చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లనున్నారు. దీంతో నాలుగు చట్ట సభల్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. రెండు దశాబ్దాలుగా బీహార్ ప్రజలు తనను విశ్వసించారని, మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. తాను అంకితభావంతో సేవ చేశానని తెలిపారు. కాగా నితీశ్‌కుమార్ రాజ్యసభ ఎన్నికలకు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఆయన రాజీనామా చేస్తారని తెలియడంతో జేడీయూ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయనే సీఎంగా కొనసాగాలని కోరుతున్నారు.
Nitish Kumar Resigns | కొత్త సీఎం ఎవరు
నితీశ్‌కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బీహార్ సీఎం (Bihar CM) ఎవరు అవుతారనే ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నుంచి సీఎం అవుతారా.. మళ్లీ జేడీయూకే అవకాశం ఇస్తారా అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. పలువురి పేర్లు సీఎం రేసులో ఉన్నాయి. సామ్రాట్ చౌదరి (Samrat Chaudhary) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన బీజేపీకి చెందిన వారు. ప్రస్తుతం ఆర్థికం, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి ,హోం వ్యవహారాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. జనవరి 2024లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా సైతం పని చేశారు. సామ్రాట్ చౌదరి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి శకుని చౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు.
ఇది కూడా చదవండి..: Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్?

