అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Bike Accident | బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మాధవనగర్ (Madhavanagar) ఆర్వోబీ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
Nizamabad Bike Accident | చికిత్స పొందుతూ..
నగరంలోని సుభాష్‌నగర్ (Subhash Nagar)కు చెందిన అనురాగ్(18) సోమవారం అర్ధరాత్రి మాధవనగర్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతడికి సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. 6వ టౌన్ పోలీసులు (Nizamabad Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వంతెన నిర్మాణ ప్రాంతంలో చిమ్మచీకట్లు..
మాధవనగర్ శివారులోని రైల్వే ట్రాక్ వద్ద ఆర్వోబీ పనులు జరుగుతున్నాయి. అయితే రాత్రివేళల్లో ఆ ప్రాంతంలో చిమ్మచీకట్లు అలుముకుంటున్నాయి. లైట్లు లేని కారణంగా ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..: Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
