Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 

నిజామాబాద్

Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 

నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్​కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. శనివారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన బడ్జెట్​ సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 28, 2026 4:36 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
Nizamabad corporation budget |
Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ :  Nizamabad corporation budget | నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్​కు(corporation budget) పాలకవర్గం ఆమోదం తెలిపింది. శనివారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి(mayor Uma Rani) అధ్యక్షతన బడ్జెట్​ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మహేశ్​కుమార్​గౌడ్​, అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(Mla Dhanpal), కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.

Contents
  • Nizamabad corporation budget | నిజామాబాద్​ కార్పొరేషన్​లో..
    • Nizamabad corporation budget | ఎన్నికల వరకే రాజకీయాలు
      • Nizamabad corporation budget |అన్ని డివిజన్లనకు..
        • అంకితభావతో కృషి చేయాలి

Nizamabad corporation budget | నిజామాబాద్​ కార్పొరేషన్​లో..

కార్పొరేషన్​ 2026-27 ప్రతిపాదిత బడ్జెట్​తో పాటు, 2025-26 సవరించిన అంచనా బడ్జెట్​ను సమావేశంలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 01 నాటికి ప్రారంభ నిల్వ రూ.94.71 కోట్లు కాగా.. 2025-26 సవరణ అంచనా ఆదాయం రూ. 137.17 కోట్లు. మొత్తం కలుపుకుని గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.231.88 కోట్లుగా పేర్కొన్నారు. 2026-27 సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ.147.63 కోట్లుగా పొందుపరిచారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా రూ.99.37 కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు. మొత్తం అంచనా వ్యయం రూ.247 కోట్లుగా పద్దులో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్జెట్ వివరాలను సమావేశంలో చదివి వినిపించగా, సభ్యులు ఆమోదం తెలిపారు.

Nizamabad corporation budget | ఎన్నికల వరకే రాజకీయాలు

తమతమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్​పాల్​, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం అని, నిజామాబాద్ నగర అభివృద్దే ధ్యేయంగా అందరం పార్టీలకు అతీతంగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ అన్నారు. నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

Nizamabad corporation budget |అన్ని డివిజన్లనకు..

అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని (Telangana municipal) మున్సిపల్ అధికారులకు మహేశ్​గౌడ్​ సూచించారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలు అనివార్యంగా మారిందన్నారు. ఇప్పటికే ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని, ఎవరికీ ఎలాంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకు ముసాయిదా ప్లాన్​లో ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే వాటిని చేపట్టేందుకు వీలుగా కార్పొరేటర్లతో భేటీ నిర్వహించాలని సూచించారు.

అంకితభావతో కృషి చేయాలి

ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, వారికి జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. ఆయా డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు వీలుగా(local governance) నెల రోజులలోపే మేయర్ అనుమతితో నగర పాలక సంస్థ(Telangana politics) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. కార్పొరేషన్ ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు(civic development) వీలుగా ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పారదర్శకంగా పరిష్కరిస్తూ అర్హత కలిగిన వారికి అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​ 

 

Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Banswada MLA Arrest | బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేల అరెస్ట్​..
Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
TAGGED:civic developmentCollector Ila Tripathilocal governancemayor Uma RaniTelangana municipalTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​ Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article Olympiad Education Benefits Olympiad Education Benefits | విద్యార్థుల బంగారు భవితకు బాట.. ఒలంపియాడ్‌ విద్య..
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Road Safety Awareness | రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరికి అవగాహన

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?