అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad Development Plans | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నగరస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ నిజామాబాద్‌ను (Nizamabad) అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
Nizamabad Development Plans | మౌలిక సదుపాయాల విస్తరణ, పథకాల అమలుపై సూచనలు..
ఈ సందర్భంగా ఆయన నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక సూచనలు చేశారు. నగరంలో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, స్ట్రీట్‌లైట్లు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే సేవలను వేగవంతం చేయాలని, ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బడ్జెట్‌లో ప్రతిబింబించే విధంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పారదర్శకతతో పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశానికి మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షత వహించారు. సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Urban MLA Dhanapal), కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), నగరానికి చెందిన వివిధ పార్టీల కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి..: Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్‌ను నాణ్యతతో నిర్మించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
