అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Drinking Water | జిల్లాలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పేర్కొన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ బూస్టర్ సిస్టంను (booster system) ఆమె శుక్రవారం తనిఖీ చేశారు.
Nizamabad Drinking Water | మారుమూల నివాస ప్రాంతాలకు నీరు చేరేవిధంగా..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మారుమూల నివాస ప్రాంతాలకు (rural water supply) సైతం రక్షిత తాగునీరు సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇలా నీటిని సరఫరా చేసేందుకు ఆన్లైన్ బూస్టర్ సిస్టం పనిచేస్తుందన్నారు. ఈ మేరకు సిస్టం పనితీరు.. ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిట్టచివరన ఉండే ఆవాసాలకు కూడా తాగునీరు చేరుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
Nizamabad Drinking Water | అనంతగిరి, పోచారం గ్రామాలకు..
అనంతగిరి, పోచారం గ్రామాలకు సైతం తాగునీటి సరఫరా కోసం ఇదే తరహా ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ (Nizamabad news) అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఆవాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు రాకేష్, స్వప్న తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి : KCR Jeevan Reddy Meeting | మీతో పని చేయమని ఆ దేవుడే పంపాడు.. కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి
