Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad municipal corporation | బిల్డర్​ నుంచి డబ్బులు డిమాండ్​.. కార్పొరేటర్​పై కేసు నమోదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad municipal corporation | బిల్డర్​ నుంచి డబ్బులు డిమాండ్​.. కార్పొరేటర్​పై కేసు నమోదు

నిజామాబాద్

Nizamabad municipal corporation | బిల్డర్​ నుంచి డబ్బులు డిమాండ్​.. కార్పొరేటర్​పై కేసు నమోదు

నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో కార్పొరేటర్ల వసూళ్ల పర్వం అప్పుడే మొదలైంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ కార్పొరేటర్​పై​ కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 1:25 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Nizamabad municipal corporation

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad municipal corporation | నిజామాబాద్​ నగర పాలక సంస్థ పరిధిలోని ఓ బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదైంది. నగరంలోని లలితానగర్​కు చెందిన బిల్డర్​ గడ్డం ప్రసాద్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక బీజేపీ కార్పొరేటర్​ మఠం పవన్​పై ఐదో టౌన్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​ నం. 62/2026, బీఎన్​ఎస్​ సెక్షన్​ 308(1) కింద కేసు నమోదు చేస్తూ ఈ నెల 6న ఎఫ్​ఐఆర్​ జారీ అయ్యింది.

Contents
  • Nizamabad municipal corporation | ఎఫ్​ఐఆర్​ ఆధారంగా..
    • Nizamabad municipal corporation | రాజకీయ వర్గాల్లో చర్చ

Nizamabad municipal corporation | ఎఫ్​ఐఆర్​ ఆధారంగా..

ఎఫ్​ఐఆర్​లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు గడ్డం ప్రసాద్​ గత ఏడు సంవత్సరాలు బిల్డర్​గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అయోధ్యనగర్​లో వంద గజాల స్థలంలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. కాగా.. సంబంధిత ఇల్లు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్​ కార్పొరేషన్​ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ స్థానిక కార్పొరేటర్​ మఠం పవన్​, అతని అనుచరుడు వినోద్​ 15 రోజుల క్రితం తనను డబ్బులు డిమాండ్​ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటి పనులు నిలిపివేయిస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో విచారణ జరిపిన ఐదో టౌన్​ పోలీసులు మఠం పవన్​తో పాటు అతని అనుచరుడు వినోద్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nizamabad municipal corporation | రాజకీయ వర్గాల్లో చర్చ

నిజామాబాద్​ నగర పాలక సంస్థ పాలకవర్గం ఇటీవలే కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలి సమావేశం జరిగి కూడా నెల రోజులు కాలేదు. అప్పుడే కార్పొరేటర్ల వసూళ్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదు కావడం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి..: Pochampad | పోచంపాడ్‌లో కత్తిపోట్ల కలకలం.. యువకుడి మృతి

Lifestyle Diseases Awareness | జీవనశైలిలో మార్పులతోనే అనారోగ్య సమస్యలు: మెడికవర్​ హాస్పిటల్​ డాక్టర్​​ ఆనంద్​ మాలు
Nizamabad Municipal Budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ సమావేశం ప్రారంభం
Siddarameshwara Temple Closure | గ్రహణం ఎఫెక్ట్​.. సిద్దరామేశ్వరాలయం మూసివేత
ABVP Leaders Arrest | కలెక్టరేట్​లో బస చేసేందుకు ఏబీవీపీ నాయకుల యత్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు
Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత
TAGGED:BJP CorporatorBuilder Caselocal newsMunicipal CorporationNizamabad Municipal CorporationNizamabad Newspolice caseTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KTR Anger KTR Anger | బీఆర్​ఎస్​ నేతల హౌజ్​ అరెస్ట్​పై కేటీఆర్​ ఆగ్రహం
Next Article Migrant Workers LPG Migrant Workers LPG | వలస కార్మికులకు కేంద్రం గుడ్​న్యూస్​.. 5 కేజీల సిలిండర్ల సరఫరా రెట్టింపు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?