అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Police | ఉరివేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని ఐదో టౌన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Nizamabad Police | ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో..
ఐదో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ స్టేషన్ పరిధిలోని సీతారాంనగర్లోని (Sitaramnagar) ఓ ఇంట్లో యువకుడు రాకేష్(28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం వచ్అంచింది. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువకుడి మృతిపై విచారణ చేపట్టారు.
గొడవలు.. ఆర్థిక సమస్యలు..
రాకేష్ కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు పేర్కొన్నారు. కుటుంబంలో మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండవచ్చని వారు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాకేష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఐదో టౌన్ పోలీసులు (Fifth Town Police) విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Varshit Reddy UPSC Rank | భీమ్‌గల్ యువకుడికి సివిల్స్‌లో ఆల్ఇండియా ర్యాంక్

