అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Premier League | క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్’ నిర్వహిస్తున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో శుక్రవారం లీగ్‌కు సంబంధించిన పోస్టర్, టీ షర్ట్స్‌లను ఆవిష్కరించారు.
Nizamabad Premier League | యువత పెడదోవ పట్టకుండా..
యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు క్రీడాపోటీలు ఎంతో ఉపయోగపడతాయని సీపీ అన్నారు. జిల్లాస్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువకులు, ప్రజలకు సైబర్ సెక్యూరిటీ (Cyber Security), మాదక ద్రవ్యాల నిర్మూలన (Narcotics) ట్రాఫిక్ నిబంధనల (Traffic Awareness)పై విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నిర్వహణ కమిటీలో ఎన్ఎస్సీ ఛైర్మన్‌గా సాయి చైతన్య, కన్వీనర్‌గా బస్వారెడ్డి, జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి వ్యవహరిస్తారన్నారు. కమిటీలో జాయింట్ సెక్రెటరీలుగా శ్రీనివాస్ రెడ్డి (స్పోర్ట్స్), డాక్టర్ శిరీష్ కుమార్ (సైబర్ సెక్యూరిటీ), రజినీకాంత్ (ఫిజికల్ సెక్యూరిటీ), ట్రెజరర్‌గా సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.
Nizamabad Premier League | ఐదురకాల పోటీలు..
ఈ టోర్నీలో వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ పోటీలు నిజామాబాద్‌లోని డీఎస్ఏ మైదానంలో జరగనున్నాయి. ఈ మూడు విభాగాలలో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 20,000, రెండవ బహుమతిగా రూ. 10,000, మూడవ బహుమతిగా రూ. 5,000 అందజేయనున్నారు. కబడ్డీ పోటీలు కేవలం పురుషులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. అలాగే యోగా పోటీలు సుభాష్ నగర్‌లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్‌లో జరుగనున్నాయి. ఇందులో అండర్-14, అండర్-18, ఇలా ఆరు కేటగిరీల్లో పోలీసులు జరుగనున్నాయి. యోగా విభాగంలో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 3,000, రెండవ బహుమతిగా రూ. 2,000, మరియు మూడవ బహుమతిగా రూ. 1,000 ఇవ్వనున్నారు.
Nizamabad Premier League | మహిళా డిగ్రీ కళాశాలలో క్రికెట్..
క్రికెట్ పోటీలు కంఠేశ్వర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 12 ఓవర్ల ఫార్మాట్‌లో హార్డ్ టెన్నిస్ బాల్‌తో జరుగనున్నాయి. క్రికెట్ ఎంట్రీ ఫీజు రూ.5,000 కాగా, కేవలం మొదట నమోదు చేసుకున్న టీంలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. క్రికెట్ విజేతలకు మొదటి బహుమతి రూ.లక్ష, రన్నరప్‌కు రూ.50,000 నగదు బహుమతి ప్రకటించారు. క్రికెట్ క్రీడాకారులు సొంతంగా తెలుపు ప్యాంట్, తెలుపు బూట్లు తెచ్చుకోవాలి, నిర్వాహకులు కేవలం టీ-షర్టులు మాత్రమే అందిస్తారు.
ఎంట్రీలు ఎప్పటి నుంచి అంటే..
ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు 11వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పోటీలకు సంబంధించిన డ్రా 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తీయనున్నారు. ఈ టోర్నమెంట్ కేవలం నిజామాబాద్ జిల్లా నివాసులకు మాత్రమే అవకాశం ఉంది. క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వెంట తీసుకురావాలి. యోగా పోటీదారులు వయస్సు ధ్రువీకరణ కోసం స్కూల్ బోనోఫైడ్ లేదా ఎస్సెస్సీ మెమో సమర్పించాల్సి ఉంటుంది. టోర్నమెంట్ సమన్వయకర్తలుగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బి.పవన్ కుమార్ (9701177144) కబడ్డీ కోచ్ ప్రశాంత్ బాధ్యతలు చేపట్టారు. పేర్ల నమోదు కోసం వాలీబాల్ బి.మల్లేష్ గౌడ్ (9440711635), బాస్కెట్ బాల్ బి.నరేష్ (9440404424), కబడ్డీ ఎం.ప్రశాంత్ (9866770889), యోగా పోటీల్లో పాల్గొనేందుకు సంగీత (9848420803), గంగాధర్ (8074982200)లను సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే క్రికెట్ పోటీల కోసం సురేష్ కుమార్ (9849202586), విక్రమ్ (9493309972)లను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..: Congress Leader Ramakrishna | కిరాయి మూకలతో బీజేపీ చేస్తున్న దాడులు సరైనవి కావు: కాంగ్రెస్ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
