అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Railway Projects | రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ (mp arvind news) కోరారు. ఈ మేరకు ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సోమవారం కలిశారు.
Nizamabad Railway Projects | ప్రాజెక్ట్‌లు ఆలస్యమవుతున్న నేపథ్యంలో..
ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన (telangana railway development) రైల్వే ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ అర్వింద్ అభ్యర్థించారు. అయితే కొన్ని అంశాల్లో ఇంకా నిర్ణయాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి కేంద్ర రైల్వే మంత్రిని కలిసి పెండింగ్ ప్రాజెక్టులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జంక్షన్‌లో పిట్‌లైన్, కోచింగ్ డిపో ఏర్పాటు, పలు రైళ్ల పొడగింపులు అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు ఆమోదం వంటి అంశాలు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని వివరించారు.
Nizamabad Railway Projects | నవీపేట్, ఇందల్వాయి..
నవీపేట్, ఇందల్వాయి వద్ద అదనంగా ROBలు, డిచ్పల్లి వద్ద ఆర్యూబీ (indian railways updates) నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ కోరారు. జానకంపేట్ (north telangana news) వద్ద ఆర్యూబీ విస్తరణ, రైళ్ల పొడిగింపు, నిజామాబాద్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా తిరుపతికి రైళ్లు, నిజామాబాద్ మీదుగా వందే భారత్ ట్రైన్లను త్వరితగతిన అమలు చేయాలని కోరారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని..
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా (railway project delays) నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ రైల్వే మంత్రిని కోరారు. కాగా.. తాను కోరినట్లుగా ఎడపల్లి వద్ద ఆర్వోబీ నిర్మాణం, డిచ్‌పల్లిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు, ఆర్మూర్ -ఆదిలాబాద్ రైల్వే లైన్ పనుల మంజూరుపై ఎంపీ రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.

