అక్షరటుడే, ఇందూరు: Nizamabad Student Assault | విద్యార్థిపై టీచర్ దాడి చేసి చేయి విరగ్గొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లి లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
Nizamabad Student Assault | డే స్కాలర్ విద్యార్థి..
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం బోర్గాం (కే) గ్రామానికి చెందిన నాశెట్టి హేమంత్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మేమంత్ డే స్కాలర్ విద్యార్థి.
కాగా, పాఠశాల తరగతి గదిలో మంగళవారం హేమంత్ పై కెమిస్ట్రీ టీచర్ రవీందర్ దాడి చేశారు. ఈ ఘటనలో హేమంత్ చేయి విరిగింది. విషయం తెలిసి బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు విద్యార్థి తండ్రి కిరణ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ శ్రీనివాస్ వెల్లడించారు.

